ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి- సెన్సెక్స్​ 50 పాయింట్లు డౌన్ - కొవిడ్​ ఇన్​ ఇండియా

బ్యాంకింగ్​, విద్యుత్తు, ఇన్​ఫ్రా రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్​ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలను నమోదుచేశాయి. ఐటీ, ఎఫ్​ఎంసీజీ రంగాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్​ 50 పాయింట్లు కోల్పోయింది.

Market Updates
స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Feb 16, 2021, 3:39 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు ఇవాళ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లాభాలతో ప్రారంభమైనా.. చివరకు స్వల్ప నష్టాలతో సెషన్​ను ముగించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 50 పాయింట్లు కోల్పోయింది. చివరకు 52 వేల 104 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఈ సూచీ 52 వేల 517 వద్ద జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది. మళ్లీ 250 పాయింట్లకుపైగా నష్టపోయి 51 వేల 900 దిగువకు చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ఫ్లాట్​గా ముగిసింది. ఒడుదొడుకుల ట్రేడింగ్​ నడుమ చివరకు 15 వేల 313 వద్ద ముగిసింది.

బ్యాంకింగ్​, విద్యుత్తు, ఇన్​ఫ్రా రంగాల షేర్లలో అమ్మకాలు కనిపించాయి. ఐటీ, ఎఫ్​ఎంసీజీ రంగాలు తీవ్ర ఒడుదొడుకుల నడుమ ట్రేడింగ్​ను సాగించాయి.

లాభనష్టాల్లోనివి ఇవే..

లోహరంగంలోని షేర్లు దూసుకెళ్లాయి. పవర్​ గ్రిడ్ 6 శాతం​, ఓఎన్​జీసీ 5 శాతానికిపైగా లాభపడ్డాయి. టాటా స్టీల్​, హిందాల్కో, ఎన్​టీపీసీ కూడా లాభాల్లోనే ముగిశాయి.

యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, నెస్లే, ఐచర్​ మోటార్స్​ డీలాపడ్డాయి.

ఇదీ చూడండి: పెట్టుబడికి బంగారు బాట 'పసిడి బాండ్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.