ETV Bharat / business

లాక్​డౌన్​లో 'టీసీఎస్​' ఉచిత నైపుణ్య శిక్షణా కార్యక్రమం - TCS India

కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉంటూనే తమ ప్రతిభను మెరుగుపరచుకునేందుకు మరో అద్భుత అవకాశాన్ని కల్పించింది టీసీఎస్. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు 15రోజుల పాటు ఉచిత నైపుణ్య శిక్షణనివ్వనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

TCS CAREER EDGE
'కెరీర్​ ఎడ్జ్'​ పేరిట ఉచిత నైపుణ్య శిక్షణా కార్యక్రమం: టీసీఎస్​
author img

By

Published : Apr 6, 2020, 5:45 PM IST

లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగపరచుకునేందుకు బెంగళూరు- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​) అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. టీసీఎస్​ అయాన్​ విభాగం ద్వారా 15 రోజుల పాటు ఉచిత నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కళాశాల విద్యార్థులు, ఉద్యోగార్థులు.. వారి నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనేందుకు ప్రత్యేకంగా 'కెరీర్​ ఎడ్జ్​' పేరిట 'సెల్ఫ్​-పేస్​డ్​ డిజిటల్​ సర్టిఫికేషన్​ ప్రోగ్రామ్'​ను రూపొందించింది.

'ఈ కార్యక్రమంలో అభ్యాసకులు నేర్చుకునేందుకు వీలుగా నానో వీడియోలు, కేస్​ స్టడీస్​ ఉంటాయి. నైపుణ్యం పరంగా వారి బలాలు- బలహీనతలను అంచనా వేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్​ను మొబైల్​ఫోన్​, ల్యాప్​టాప్​, డెస్క్​టాప్​, ట్యాబ్​ల వంటి పరికరాలలో యాక్సెస్​ చేసుకోవచ్చు. తద్వారా మనకు అవసరమైన విధంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ కోర్సులు విద్యార్థులు, విద్యావేత్తలకు చక్కగా తోడ్పడతాయి.'

- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​, బెంగళూరు

కొవిడ్​-19 వ్యాప్తి నేపథ్యంలో... ఇంతకముందే ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించింది టీసీఎస్​ అయాన్​. ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలకు 'డిజిటల్​ గ్లాస్​ రూమ్​' పేరిట 'వర్చువల్​ లెర్నింగ్​' వేదికగా ఉచిత విద్యా కోర్సులను అందిస్తోంది.

ఇదీ చదవండి: కరోనా కాలంలో అప్పు కావాలా? ఇవి తెలుసుకోండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.