ETV Bharat / business

ఎల్​ఐసీ, ఇండియా పోస్ట్ బీమా చెల్లింపుల గడువు పెంపు - lic latest news

దేశంలో కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో పాలసీ చెల్లింపులపై ఎల్ఐసీ, ఇండియా పోస్ట్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రీమియం చెల్లింపుల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

LIC
బీమా
author img

By

Published : Apr 12, 2020, 6:30 AM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో పాలసీదారులు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించేందుకు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి, ఏప్రిల్ ప్రీమియం చెల్లింపుల గడువును 30 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

తాజా నిర్ణయం ప్రకారం.. ఫిబ్రవరి చెల్లింపులకు సంబంధించిన గ్రేస్ పిరియడ్ మార్చి 22తో పూర్తయ్యే వారికి ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించారు. ప్రీమియం చెల్లించాలనుకున్నవారు ఆన్​లైన్ ద్వారా కూడా కట్టొచ్చని ఎల్ఐసీ తెలిపింది.

వివిధ రకాలుగా..

ఆన్​లైన్​లో చెల్లించేవారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరం లేదని.. ప్రాథమిక వివరాలు ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఎల్ఐసీ పే డైరెక్ట్ యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చని సూచించింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భీమ్, యూపీఐ ద్వారా చెల్లింపులు అంగీకరిస్తామని స్పష్టం చేసింది.

కరోనా బాధితులకూ..

కరోనా కారణంగా మృతి చెందిన వారికి బీమా వర్తిస్తుందని ఎల్ఐసీ స్పష్టం చేసింది. అలాంటి వారి ఇన్స్యూరెన్స్ మొత్తం అత్యవసర ప్రాతిపదికన చెల్లిస్తామని పేర్కొంది. ప్రభుత్వ డేటాను గుర్తించి కరోనా బాధితుల కుటుంబాలకు తక్షణ సాయం అందేలా చూస్తామని ప్రకటించింది. ఇప్పటికే 16 కుటుంబాలకు చెల్లించినట్లు తెలిపింది.

భారతీయ తపాలా కూడా..

ఎల్ఐసీ తరహాలోనే భారతీయ తపాలా కూడా ప్రీమియం చెల్లింపుల గడువును పెంచింది. పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ తుది గడువును జూన్ 30 వరకు పొడిగించారు. వీటికి ఎలాంటి పెనాల్టీ విధించమని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: పీఎం కేర్స్‌ విరాళ వివరాలు ఫారం 16లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.