ETV Bharat / business

సినిమా, గేమింగ్​ కోసం ఎల్​జీ కొత్త టీవీ - ఎల్​జీ ఓఎల్​ఈడీ48సీఎక్స్​ టీవీ ఫీచర్లు

ఎలక్ట్రానిక్​ దిగ్గజం ఎల్​జీ మరో కొత్త స్మార్ట్​ టీవీని ఆవిష్కరించింది. స్పోర్ట్స్​, సినిమా, గేమింగ్​ ప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఈ మోడల్​ను తీసుకొచ్చనిట్లు ఎల్​జీ పేర్కొంది. మరి కొత్త టీవీ ఫీచర్లు, ధర, ఇతర విశేషాలపై మీరూ ఓ లుక్కేయండి.

new smart Tv from LG
ఎల్​జీ కొత్త స్మార్ట్​టీవీ
author img

By

Published : Mar 30, 2021, 3:11 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్​ దిగ్గజం ఎల్​జీ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్​టీవీని విడుదల చేసింది. గేమింగ్, సినిమా, స్పోర్ట్స్​ ప్రియులకు ప్రత్యేక అనుభూతినిచ్చేలా.. 'ఓఎల్​ఈడీ48సీఎక్స్​టీవీ' పేరుతో ఈ కొత్త మోడల్​ను తీసుకొచ్చింది. భారీ ఫీచర్లతో విడుదలైన ఈ మోడల్​ ధరను రూ.1,99,990గా నిర్ణయించింది ఎల్​జీ. దీని సైజు 122 సెంటీమీటర్లు.

ఫీచర్లు..

ఆల్ఫా 9 మూడో తరం ప్రాసెసర్​ (ఎల్​జీ సొంత ప్రాసెసర్)- ఏఐ ట్యూనింగ్, బ్యాలెన్స్​డ్ సౌండ్​ ఎఫెక్ట్స్​ సరికొత్త హయర్​ ఫ్రేమ్​ రేట్​, వేరియబుల్​ రీఫ్రెష్​ రేట్​, ఆటోమేటిక్​​ లేటెన్సీ మోడ్​ వంటివి ఈ ప్రాసెసర్​ ప్రత్యేకత. గేమింగ్​ అనుభూతిని రెట్టింపు చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ గేమింగ్​ సంస్థ ఎన్వీడియా జీ-సింక్ సాంకేతికతను ఈ టీవీలో పొందుపరిచింది ఎల్​జీ.

స్పోర్ట్స్​ అలర్ట్​- స్పోర్ట్స్ అనుభూతిని సీమ్​లెస్​గా అందించేందుకు ఈ ఫీచర్​ తీసుకొచ్చింది ఎల్​జీ. యూజర్లు ఎక్కువగా చూసే క్రీడలకు సంబంధించిన అప్​డేట్స్​ ఇవ్వడమే ఈ ఫీచర్​ ప్రత్యేకత.

సినిమా అనుభూతి- ఈ టీవీలో సెల్ఫ్​-లిట్ పిక్సెల్ సాంకేతికతను పొందుపరిచినట్లు ఎల్​జీ పేర్కొంది. దీని ద్వారా సినిమాలు చూసేటప్పుడు రంగులు మరింత స్పష్టంగా, రిచ్​గా కనిపిస్తాయని ఎల్​జీ వివరించింది. ఏ కోణం నుంచి చూసినా పిక్చర్​ స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది.

ఇదీ చదవండి:పోకో కొత్త స్మార్ట్​ఫోన్​ ధర, ఫీచర్లు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.