వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల పలు వాహన తయారీ సంస్థలు ప్రకటించాయి. వీటిలో వివిధ సంస్థలకు చెందిన కార్లు సహా ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఏ వాహనంపై ఎంతెంత ధర పెరిగిందంటే..
- టాటా మోటార్స్ తమ వాహనాలపై 0.8 శాతం ధరలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. రూ.4000 నుంచి ప్రారంభమై.. వాహనం మోడల్ బట్టి రూ. 17,500 వరకు ఈ పెరుగుదల ఉంది. టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్, టిగోర్, హేరియర్, సఫారీ మోడళ్లకు ఈ ధరల పెరుగుదల వర్తిస్తుంది. ఈనెల 31 తర్వాత ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి.
- టొయోటా సంస్థ.. ఇన్నోవా క్రిస్టా మోడల్ కారు ధరను 2 శాతం (దాదాపు రూ.32,800) పెంచింది. ఈనెల 1 నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి.
- అమేజ్, డబ్ల్యూఆర్వీ, సిటీ, జాజ్ కార్లపైన రూ.9వేల నుంచి రూ.లక్ష వరకు ధరలను పెంచుతున్నట్లు హోండా కార్స్ ఇటీవల పేర్కొంది. ఈనెల 2వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమలయ్యాయి.
- స్విఫ్ట్ డిజైర్ కార్లపైన మారుతీ సుజుకీ.. రూ. 8వేలు నుంచి రూ.15వేల వరకు ధరలను పెంచింది. గత నెలలోనే ఈ ధరల పెంపును సంస్థ అమలు చేసింది.
- థార్ మోడల్‌పైన మహీంద్రా సంస్థ రూ.32వేల నుంచి రూ.92వేల వరకు పెంచింది. గత నెల నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి.
- కైగర్ వాహనంపై రూ.9వేల నుంచి రూ.39వేల వరకు ధర పెరుగుదల ఉంటుందని రినాల్ట్ సంస్థ ఇటీవల పేర్కొంది. మే నెలలోనే ఈ ధరల పెంపు అమలు అయింది.
- హీరో సంస్థకు చెందిన అన్ని మోడల్స్‌పై రూ.850 నుంచి రూ.3850 వరకు ధరలు పెంచుతున్నట్లు హీరో మోటార్ కార్ప్ తెలిపింది. గత నెల 1వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
- జిక్సర్, ఇన్ట్రూడర్ బైక్స్పైన రూ.2100 నుంచి రూ.3500 వరకు పెంచుతున్నట్లు సుజుకీ మోటార్స్సైకిల్ సంస్థ ఇటీవల ప్రకటించింది. జులై మొదటి వారంలో ఈ ధరలు అమలులోకి వచ్చాయి.
- పల్సర్, అవెంజర్, కేటీఎం మోడళ్లపైన ధరలను బజాజ్ ఆటో 3 శాతం పెంచింది. గత నెలలోనే ఈ ధరలను పెంపును సంస్థ అమలు చేసింది.
- యమహా కూడా ఆర్15, ఎంటీ15 మోడళ్ల ధరను రూ.2,500 నుంచి రూ.5000 వరకు పెంచింది. జులై నుంచే ఈ ధరల పెంపు అమలు అయింది.
ఇదీ చదవండి : ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు!