దక్షిణ కొరియా దిగ్గజ ఆటో మేకర్ కియా మోటార్స్.. భారత్‌లో తయారు చేస్తున్న మూడో మోడల్ 'ఎస్యూవీ సోనెట్'ను ప్రపంచవాప్యంగా వర్చువల్‌గా విడుదల చేసింది. వచ్చే నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది. భారత్‌లో ఇప్పటివరకు సెల్టోస్, కార్నివాల్ మోడల్స్‌ను తయారు చేసింది కియా. సోనెట్‌ను కూడా అనంతపురం ప్లాంట్ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది.
హ్యుందాయ్ వెన్యూ, మారుతి విటారా బ్రేజా, టాటా నెక్సాన్, మహీంద్ర ఎక్స్‌యూవీ 300 వంటి కార్లకు.. అధునాతన ఫీచర్లతో రూపొందిస్తున్న కంపాక్ట్ ఎస్యూవీ సోనెట్‌తో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కియా. ఎస్యూవీ మార్కెట్ వృద్ధి అవసరాలను తీర్చేలా.. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త అనుభూతినిచ్చేలా సోనెట్‌ను తయారు చేస్తున్నట్లు పేర్కొంది.
సెల్టోస్, కార్నివాల్ తరహాలోనే ఈ మోడల్కూడా విజయవంతం అవుతుందని కియా నమ్మకంతో ఉంది. సోనెట్‌తో భారత విపణిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈఓ కూక్యున్ శిమ్ చెప్పారు.
ఇదీ చూడండి: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?