ETV Bharat / business

మన రోడ్లపై 2 లక్షల కియా సెల్టోస్ కార్ల రయ్​రయ్​ - సెల్టోస్​ విక్రయాలు

కియా మోటర్స్​ ఇండియా ఫ్లాగ్​షిప్​ ఎస్​యూవీ సెల్టోస్​ కార్ల అమ్మకాల్లో కీలక మైలురాయిని అందుకున్నట్లు ప్రకటించింది. తొలి కారును దేశంలో ప్రవేశపెట్టిన రెండేళ్లలోనే 2 లక్ష అమ్మకాల మార్కును దాటినట్లు వెల్లడించింది.

kia seltos
కియా సెల్టోస్​
author img

By

Published : Aug 20, 2021, 5:32 PM IST

దక్షిణ కొరియా ఆటోమొబైల్​ దిగ్గజం కియా మోటర్స్​ ఇండియా కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో తొలి ఉత్పత్తిని ప్రవేశపెట్టిన రెండేళ్లలోపే ఫ్లాగ్​షిప్​ ఎస్​యూవీ సెల్టోస్​ కార్ల అమ్మకాల్లో 2 లక్షల మార్క్​ను దాటింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది సంస్థ. అంతేగాకుండా ఇంటర్​నెట్​ ఎనేబుల్డ్​ కనెక్టెడ్​ కార్ల విక్రయాలు కూడా అదే స్థాయిలో పెరిగినట్లు పేర్కొంది. ఈ రెండేళ్లలోనే 1.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది.

కియా మోటర్స్ ఇండియా మొత్తం విక్రయాల్లో ఎస్​యూవీ సెల్టోస్​ 66 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం అమ్మకాలు మూడు లక్షలు దాటినట్లు సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి:మార్కెట్లోకి కియా తొలి ఎలక్ట్రిక్​ కారు- ధర, ఫీచర్లు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.