ETV Bharat / business

Jio Phone Next: జియోఫోన్​ రిలీజ్​ వాయిదా.. ఎప్పుడంటే? - రిలయన్స్​ జియో

జియోఫోన్​ నెక్ట్స్​ (Jio Phone next) విడుదలను వాయిదా వేస్తున్నట్లు జియో గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని స్పష్టం చేసింది. మరి అందరూ ఎదురుచూస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​.. మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే?

jio phone next postponed
జియోఫోన్​ రిలీజ్​ వాయిదా.. ఎప్పుడుంటే..
author img

By

Published : Sep 10, 2021, 5:13 AM IST

Updated : Sep 10, 2021, 6:23 AM IST

దిగ్గజ టెలికాం సంస్థ జియో​, గూగుల్​తో కలిసి రూపొందిస్తున్న స్మార్ట్​ఫోన్​(Jio smartphone).. జియోఫోన్​ నెక్ట్స్​. ఈ స్మార్ట్​ఫోన్ సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు జియో ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా ఈ విడుదలను వాయిదా వేస్తున్నట్లు సంస్థ గురువారం ప్రకటించింది. జియోఫోన్​ నెక్ట్స్​ను (Jio Phone next) దీపావళి సందర్భంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

అదే కారణం..

జియోఫోన్​ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని.. వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి తేలేకపోవడానికి అదే కారణమని జియో వెల్లడించింది. ఫోన్​ తయారీకి సంబంధించి మెరుగైన పురోగతినే సాధించామని పేర్కొంది. దీపావళి నాటికి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ల కొరత కూడా తగ్గే అవకాశం ఉందని జియో అభిప్రాయపడింది.

ఇదీ చూడండి : వచ్చే నెల నుంచి ఆ బ్యాంకుల చెక్‌బుక్‌లు పనిచేయవు!

Last Updated : Sep 10, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.