ETV Bharat / business

JioPhone Next: రూ.500కే జియో స్మార్ట్​ఫోన్​?

ఆఫర్ల ద్వారా వినియోగదారులను పెంచుకోవడంలో జియో తర్వాతే ఏ కంపెనీ అయినా. గతంలో ఫ్రీ సిమ్​, ఫ్రీ డేటా వంటి ఆఫర్లే (Jio Offers) ఇందుకు ఉదాహరణ. జియోఫోన్​ నెక్ట్స్‌(JioPhone Next)ను కూడా ఇలాంటి వినూత్న ఆఫర్లతోనే విక్రయంచనుందని సమాచారం.

Jiophone Next
జియో ఫోన్ నెక్ట్స్​
author img

By

Published : Sep 3, 2021, 1:02 PM IST

జియో-గూగుల్‌ భాగస్వామ్యంలో రానున్న స్మార్ట్‌ఫోన్‌ జియోఫోన్‌ నెక్ట్స్‌ను (JioPhone Next) వినాయక చవితి పర్వదినమైన సెప్టెంబరు 10న విడుదల చేయనుంది రిలయన్స్. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఇదే అని ప్రకటించిన నేపథ్యంలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్‌ ఫీచర్లు, ధరకు (JioPhone Price) సంబంధించి నెట్‌లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది టిప్‌స్టర్లు ఇస్తున్న సమాచారంతో ఈ ఫోన్‌కు సంబంధిన అనేక వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అయితే, జియో మాత్రం ఇప్పటి వరకు ఫీచర్లు, ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

కొత్త వ్యూహం..

ధరకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తాజాగా నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అందరికీ అందుబాటులో ఉండేలా.. ధర విషయంలో రిలయన్స్ జియో సరికొత్త వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది.

మొత్తం రెండు మోడళ్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇందులో ఒకటి రూ.5,000.. మరొకటి రూ.7,000 అని నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. అయితే, వీలైనంత ఎక్కువ మందికి ఈ ఫోన్లను చేర్చేందుకు జియో ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం ధరలో కేవలం 10 శాతం అంటే.. ఒక మోడల్‌కు రూ.500, మరో మోడల్‌కు రూ.700 చెల్లిస్తే ఫోన్‌ను సొంతం చేసుకునేలా ఓ ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు సమాచారం. ఇష్టమైతే వినియోగదారులు ఎక్కువ కూడా చెల్లించొచ్చని తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు, లేదా ఆర్థిక సంస్థలకు వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అంటే జియోఫోన్‌ను కొనడానికి బ్యాంకులు రుణాన్ని అందజేస్తాయన్నమాట! మరి వడ్డీ వసూలు చేస్తారా? నిర్దేశిత ఇన్‌స్టాల్‌మెంట్లేమైనా ఉంటాయా? అనే విషయాలపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఈ మేరకు జియో వివిధ బ్యాంకులు, బ్యాకింగేతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు జియో నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు.

చౌక ఫోన్లలో ట్రెండ్​ సెట్టర్​?

ఇటీవలే జియోఫోన్‌ నెక్ట్స్‌ ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉందని నెట్‌లో ఓ టిప్‌స్టర్‌ ఇచ్చిన సమాచారం చక్కర్లు కొట్టింది. ఇటు జియో గానీ, అటు గూగుల్‌ గానీ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, అందుబాటు ధరలో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను అందించే పరంపర జియోఫోన్‌ నెక్ట్స్‌ నుంచే ప్రారంభమవనుందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ గతంలో ఓ సందర్భంలో ప్రకటించారు.

ఇదీ చదవండి: 30 వేల కోట్ల డాలర్లకు టాటా గ్రూప్​ మార్కెట్​ విలువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.