ETV Bharat / business

డౌన్​లోడ్​ స్పీడ్​లో టాప్​లో నిలిచిన జియో - Jio tops 4G chart

మే​ నెలకు గాను 20.7 ఎంబీపీఎస్​ డౌన్​లోడ్ స్పీడ్​తో 4జీ నెట్​వర్క్ అందించి మరోసారి జియో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే సమయంలో అప్​లోడ్​ విషయంలో 6.7 ఎంబీపీఎస్​ స్పీడ్​​తో వొడాఫోన్ టాప్​లో ఉన్నట్లు ట్రాయ్​ తాజా నివేదికలో వెల్లడించింది.

jio
జియో
author img

By

Published : Jun 16, 2021, 7:53 PM IST

వేగవంతమైన మొబైల్ నెట్​వర్క్​గా రిలయన్స్ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మే​ నెలకు గాను 20.7 ఎంబీపీఎస్​ డౌన్​లోడ్​ స్పీడ్​తో 4జీ నెట్​వర్క్ అందించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​) వెల్లడించింది. గతంలో కంటే ఈసారి మరింత వేగం నమోదైనట్లు పేర్కొంది. అయితే ఇదే రంగంలో ఉండే సమీప పోటీదారులైన వొడాఫోన్​ ఐడియా, ఎయిర్​టెల్​ల 4జీ నెట్​వర్క్​లతో వేగంతో పోల్చితే జియోది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

వొడాఫోన్ ఐడియా 6.3 ఎంబీపీఎస్​ డౌన్​లోడ్ స్పీడ్​తో రెండో వేగవంతమైన టెలికాం నెట్​వర్క్​గా నిలిచింది. ఎయిర్​టెల్​ డౌన్​లోడ్​ స్పీడ్​ 4.7 ఎంబీపీఎస్​​గా ఉన్నట్లు ట్రాయ్ వివరించింది.

అప్​లోడ్​లో ఇలా..

అప్​లోడ్ విషయంలో మాత్రం 6.7 ఎంబీపీఎస్​ స్పీడ్​​తో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానంలో నిలిచింది.

జియో, ఎయిర్​టెల్ నెట్​వర్క్​ వరుసగా 4.2 ఎంబీపీఎస్, 3.6 ఎంబీపీఎస్​ స్పీడ్​తో 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

అయితే ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత సంచార నిగమ్​ లిమిటెడ్​ను ట్రాయ్​ తన పట్టికలో చూపించలేదు.

మై స్పీడ్​ అప్లికేషన్​ సాయంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన డేటా ద్వారా ఈ నివేదికను రూపొందించింది ట్రాయ్.

ఇదీ చూడండి: ఎస్​బీఐ యూజర్లకు అలర్ట్- ఆ సేవలకు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.