ETV Bharat / business

కృత్రిమ మేధపై జియో నజర్- రూ.112 కోట్లతో స్టార్టప్​లో వాటా - jio new investment

Jio In AI: కృత్రిమ మేధపై ప్రత్యేక దృష్టి సారించింది రిలయన్స్ జియో. బెంగళూరు ఆధారిత స్టార్టప్​లో 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.112 కోట్లపైనే వెచ్చించింది.

Jio
జియో
author img

By

Published : Feb 4, 2022, 7:40 PM IST

Jio In AI: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్​ను మరో స్థాయికి తీసుకువెళ్లే దిశగా జియో అడుగులు వేస్తోంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్​లో 25 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇందుకోసం రూ.112కోట్లపైనే వెచ్చించింది. శామ్​సంగ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్​డ్ రీసెర్చ్ మాజీ​ అధ్యక్షుడు, సీఈఓ ప్రణవ్ మిస్త్రీ స్థాపించిన ఆర్టిఫిషియల్ రియాలిటీ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ అది.

'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​, ఏఐ రీసెర్చ్​, మెటావెర్స్​, వెబ్​ 3.0 టెక్నాలజీలో మంచి అనుభవం కలిగిన టీంతో కలిసి పనిచేయబోతున్నాం. ఇంటరాక్టివ్ ఏఐ, గేమింగ్​, మెటావెర్స్​లో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తాం.' అని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు.

'భారత్​లో డిజిటల్​కు జియో పునాది. ఆర్టిఫీషియల్ రియాలిటీని వినియోగదారులకు పరిచయం చేయడానికి జియోతో కలిసి పనిచేయనున్నాము.' అని ప్రణవ్ మిస్త్రీ అన్నారు. ​

ఆర్టిఫీషియల్ రియాలిటీతో రియల్​టైమ్​ ఏఐ వాయిస్​, వీడియో కాల్స్​, డిజిటల్ హ్యూమన్స్​, గేమింగ్​లను పొందుపరుస్తారు.

ఇదీ చదవండి: జుకర్​బర్గ్​ను వెనక్కి నెట్టిన అంబానీ, అదానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.