ETV Bharat / business

ప్రపంచ అపర కుబేరుడిగా మళ్లీ జెఫ్​ బెజోస్​

ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా జెఫ్​ బెజోస్​ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆరు వారాలుగా ఈ స్థానంలో కొనసాగుతున్న ఎలాన్​ మస్క్ సంపద భారీగా తగ్గడం వల్ల బెజోస్​ అగ్రస్థానానికి ఎగబాకారు.

Bezos reclaims title of world's richest
మళ్లీ బెజోస్​ నంబర్​ 1
author img

By

Published : Feb 17, 2021, 10:48 AM IST

Updated : Feb 17, 2021, 10:57 AM IST

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆరు వారాలుగా అగ్రస్థానంలో ఉంటున్న టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ సంపద ఒక్కసారిగా 4.6 బిలియన్​ డాలర్లు తగ్గడం వల్ల బెజోస్​ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. టెస్లా షేర్లు మంగళవారం 2.4 శాతం పడిపోవడం మస్క్ సంపద తగ్గేందుకు కారణం.

బ్లూమ్​బర్గ్ తాజా నివేదిక ప్రకారం బెజోస్​ సంపద 191.2 బిలియన్​ డాలర్లు.

ఎలాన్​ మస్క్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకునేందుకు ముందు దాదాపు మూడేళ్లపాటు జెఫ్ బెజోస్​ ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో అగ్రస్థానంలో కొనసాగారు.

ఇదీ చదవండి:మేకిన్‌ ఇండియాలో భాగం కానున్న అమెజాన్!​

Last Updated : Feb 17, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.