ETV Bharat / business

హీరో మోటార్​ కార్ప్​ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు

Hero Motorcorp: హీరో మోటార్​ కార్ప్​ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ఆ సంస్థ ఛైర్మన్​, సీఈవో సహా ఇతర అధికారుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Mar 23, 2022, 12:25 PM IST

it-raids-on-hero-motorcorp-premises
హీరో మోటార్​ కార్ప్​ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు

IT Raids on Hero Motorcorp: పన్ను ఎగవేత ఆరోపణలతో దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్‌ కార్ప్‌ కు చెందిన కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హీరో మోటార్స్‌ కార్ప్‌ ఛైర్మన్, సీఈఓ పవన్ ముంజాల్‌ సహా ఆ సంస్థకు చెందిన ప్రమోటర్ల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.

బుధవారం ఉదయం నుంచి గురుగ్రామ్‌, హరియాణా, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. కంపెనీ, ప్రమోటర్లకు చెందిన ఆర్థిక దస్త్రాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను ఆదాయ పన్ను శాఖ బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను శాఖ దాడులపై హీరో మోటర్‌ కార్ప్‌ ఇంకా స్పందించలేదు. సంస్థ నిర్వాహకులు స్పందిస్తే కానీ.. పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Petrol Price Hike: రెండో రోజూ పెరిగిన పెట్రోల్​ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.