ETV Bharat / business

ఆరోగ్య బీమా పరిధిలోకి కరోనా చికిత్స- కేంద్రం నిర్ణయం - corona virus india

కరోనా వైరస్​ చికిత్సను ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

IRDA-CORONA
ఆరోగ్య బీమా పథకంతో కరోనా వైరస్​కు చికిత్స
author img

By

Published : Mar 12, 2020, 1:45 PM IST

Updated : Mar 12, 2020, 2:05 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ కేంద్ర బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్​డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా పథకాల్లో కరోనా వైరస్​ చికిత్సను చేర్చాలని ఇన్సూరెన్స్​ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

వినియోగదారులు ఎటువంటి బీమా పథకాన్ని ఎంచుకున్నప్పటికీ.. కరోనా చికిత్సను అందులో చేర్చాలని ఐఆర్​డీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఆర్​డీఏ చట్టం-1999లో 14వ సెక్షన్​లో మూడు నిబంధనలను చేర్చింది. వీటిని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది.

irda
ఐఆర్​డీఏ ప్రకటన

కొత్త నిబంధనలకు సంబంధించి మార్చి 4వ తేదీనే సర్క్యులర్ జారీ చేసిన ఐఆర్​డీఏ.. నేడు మార్గదర్శకాలు విడుదల చేసింది.

Last Updated : Mar 12, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.