ETV Bharat / business

అమెజాన్ అధిపతి ఫోన్​ హ్యాకింగ్ సౌదీ పనే! - హ్యాకింగ్

సంచలనం సృష్టించిన అమెజాన్​ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్​ ఫోన్​ హ్యాకింగ్ వివాదం మరో మలుపు తిరిగింది.​  ఇది సౌదీ అరేబియా అధికారుల పనేనని బెజోస్​ నియమించుకున్న విచారణ అధికారి స్పష్టం చేశారు.

జెఫ్ బెజోస్
author img

By

Published : Mar 31, 2019, 10:53 AM IST

Updated : Mar 31, 2019, 1:20 PM IST

జెఫ్​ బెజోస్​ ఫోన్​ హ్యాకింగ్ వివాదం
అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్​ ఫోన్​ హ్యాకింగ్​పై సరికొత్త నిజాలు బయటపడ్డాయి. ఇది సౌదీ అరేబియా అధికారుల పనేనని బెజోస్​ నియమించుకున్న విచారణ అధికారి గెవిన్ ది బెకర్ స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నంలోనే బెజోస్ ఫోన్​ హ్యాక్ చేశారని బెకర్​ తెలిపారు.

సౌదీ పాత్రికేయుడు జమాల్ కషోగ్జీ హత్య విషయంలో బెజోస్​ సొంత పత్రిక వాషింగ్టన్ పోస్ట్ విస్తృతంగా కథనాలు ప్రచురించింది. ఈ హత్య కేసులో సౌదీ రాజుపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు ప్రతీకారంగానే ఫోన్​ హ్యాకింగ్​కు పాల్పడ్డారని బెకర్​ వెల్లడించారు.

"బెజోస్​ ఫోన్​ను హ్యాక్​ చేసి వ్యక్తిగత సమాచారాన్ని సౌదీ దొంగిలించింది. మా పరిశోధకుల బృందం, చాలా మంది విశ్లేషకులు తేల్చింది ఇదే. వాషింగ్టన్​ పోస్ట్​ను సౌదీ రాజు మహ్మద్ బిన్​ సల్మాన్​ ప్రధాన శత్రువుగా భావించారు. ఇందులో బెజోస్​ భార్య తమ్ముడి పాత్ర కూడా ఉంది. సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు ఆయనకు కొంత డబ్బు అందింది."
- గెవిన్ ది బెకర్, విచారణ అధికారి

ఈ ఆరోపణలపై బెకర్ పూర్తి వివరాలు తెలుపలేదు. సౌదీలోని ఏ విభాగం హ్యాకింగ్​కు పాల్పడినదీ ప్రస్తావించలేదు. కొన్ని వివరాలు చెప్పేసి సౌదీనే దోషిగా తేల్చారు బెకర్.

అసలేం జరిగిందంటే...

బెజోస్​ ఫోన్​ నుంచి వ్యక్తిగత సమాచారం, ముఖ్యమైన ఫొటోలు బహిర్గతమయ్యాయి. ఇందులో ఆయన వివాహేతర సంబంధ విషయాలూ ఉన్నాయి. అది బెజోస్​ దంపతుల విడాకులకు దారి తీసింది.

సమాచారం ఎలా లీకైందో తేల్చేందుకు బెకర్​ ఆధ్వర్యంలో ప్రైవేటుగా విచారణ చేయించారు బెజోస్​.

ఇదీ చూడండి:నలభై రెండేళ్ల నరకం తర్వాత స్వేచ్ఛ !

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
News programs and services may excerpt portions of "NAACP Image Awards" telecast during the seven days before and following the airing on Saturday, March 30, 2019 solely for the purposes of reporting about "NAACP Image Awards" as an event and subject to the following conditions:
Broadcast Restrictions: Up to three minutes in total, but no more than 30 seconds of any single moment or performance, may be used within the period ending the first day following the telecast. Up to two minutes in total, not separate from the three minutes referenced above and no more than 30 seconds of any single moment or performance may be used within the period of the second through seventh days following the telecast. Any display, exhibition or performance of the material must be accompanied by the chyron, "Courtesy of TV One//NAACP." Online Restrictions: Up to 30 seconds may be used as part of a wrap-up package following the telecast (for purposes of clarification you may NOT use portions of "NAACP Image Awards" as standalone video assets). Any display, exhibition or performance of the material must be accompanied by the chyron, "Courtesy of TV One//NAACP." After April 6, please contact Luvie Raines at TV One for licensing of footage at lraines@tvone.tv and 301.755.2872.
Last Updated : Mar 31, 2019, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.