దేశీయ చౌక విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సర్వర్ మొరాయించింది. నెట్వర్క్లో సాంకేతిక లోపంతో సేవలు నిలిచిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈ పరిస్థితి తలెత్తిందని.. దీని పట్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
అన్ని విమానశ్రయాలపై దీని ప్రభావం పడుతుందని.. ఇండిగో తెలిపింది. సాధ్యమైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఏదైనా సహాయం, సమాచారం కోసం.. తమ కస్టమర్ కేర్, సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లను సంప్రదించవచ్చని వెల్లడించింది.