ETV Bharat / business

వ్యాక్సిన్‌ రాకపోతే మైనస్ 7.5 శాతం క్షీణత!

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు మైనస్​ 7.5 క్షీణిస్తుందని బీఓఎఫ్ఏ విశ్లేషకులు అంచనా వేశారు. కరోనాకు వ్యాక్సిన్​ రాకపోతే ఈ మేరకు నమోదవుతుందని తెలిపారు. లాక్‌డౌన్‌ను ఒక నెల పాటు పొడిగిస్తే, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటుపై 1 శాతం మేర ప్రభావం పడుతోందని వివరించారు

indais growth rate will be -7.5 if corona vaccine not invented
వ్యాక్సిన్‌ రాకపోతే మైనస్ 7.5 శాతం క్షీణత!
author img

By

Published : Jul 14, 2020, 7:09 AM IST

కొవిడ్‌-19 నిరోధానికి వ్యాక్సిన్‌ కనుక ఏడాది పాటు రాకపోతే, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం క్షీణించవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బీఓఎఫ్‌ఏ) విశ్లేషకులు అంచనా వేశారు. పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారితే, జీడీపీ -5 శాతం క్షీణించవచ్చని గతంలో అంచనా వేయగా, తాజాగా మరింత పెంచారు. లాక్‌డౌన్‌ను ఒక నెల పాటు పొడిగిస్తే, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటుపై 1 శాతం మేర ప్రభావం పడుతోందని వివరించారు. అన్‌లాక్‌ తరవాత కొవిడ్‌ కేసుల సంఖ్య మూడింతలైనందున, లాక్‌డౌన్‌ షరతులను సెప్టెంబరు మధ్యవరకు పొడిగించవచ్చని, అక్టోబరు మధ్యలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ఆరంభం కావచ్చని పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో 2 శాతం మేర రేట్లకోత విధించవచ్చని అంచనా వేశారు. మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు బాగా తగ్గినందున, భారత వాస్తవ జీడీపీ -4 శాతంగా నమోదయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 6.09% పెరిగిన రిటైల్​ ద్రవ్యోల్బణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.