ETV Bharat / business

9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు - భారత ఔషధ ఎగుమతులు

తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలకు కేంద్రమైన భారత్​ నుంచి వ్యాక్సిన్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో మన దేశం నుంచి సుమారు రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు నమోదయ్యాయి.

India's drug exports worth Rs 1.8 lakh crore in 9 months
9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్ల విలువైన ఔషధ ఎగుమతులు
author img

By

Published : Mar 12, 2020, 7:20 AM IST

మనదేశం నుంచి వ్యాక్సిన్లు, తుది ఔషధాలు (ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు) పెద్దఎత్తున కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. నాణ్యతపై నమ్మకం, తక్కువ ధరలో లభించడం దీనికి ప్రధాన కారణాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో (ఏప్రిల్‌ నుంచి డిసెంబరు) మనదేశం నుంచి సుమారు రూ.1.08 లక్షల కోట్ల (15,546.78 మిలియన్‌ డాలర్ల) విలువైన ఔషధ ఎగుమతులు నమోదయ్యాయి. 2018-19 ఇదేకాలంలో 13,943.79 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.97,600 కోట్ల) ఎగుమతులు జరిగాయి. దీంతో పోల్చితే ఈసారి 11.50 శాతం పెరిగినట్లు అవుతోంది. అమెరికా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తోడు చైనా తదితర ఆసియా దేశాలు సైతం మనదేశం నుంచి ఔషధాలు అధికంగా కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ సారధ్యంలోని ఫార్మాగ్జిల్‌ (ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ తెలిపారు. ఇటీవలి వరకు మన ఔషధాలపై చైనా ఆసక్తే చూపలేదు.

2019 ఏప్రిల్‌-డిసెంబరులో చైనాకే 200 మిలియన్‌ డాలర్ల (రూ.1400 కోట్లకు పైగా) విలువైన ఔషధాలను మన ఔషధ కంపెనీలు ఎగుమతి చేశాయి. రష్యా, నెదర్లాండ్స్‌, టాంజానియా, జర్మనీ, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు కూడా ఎగుమతులు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యమైన 2200 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.54 లక్షల కోట్ల) ఎగుమతులు నమోదు చేసే అవకాశం ఉంది. 2018-19 ఎగుమతులతో పోలిస్తే 12 శాతం వృద్ధికి సమానం. 2 నెలలుగా కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నందున, అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. ఔషధ ఎగుమతులపై ఈ ప్రభావం ఉండకపోవచ్చన్నది పరిశ్రమ అంచనా.

వ్యాక్సిన్లు అధికం

ఎగుమతుల్లో వాటా పరంగా చూస్తే ఫార్ములేషన్లు (ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు వంటి తుది ఔషధాలు), బయోలాజికల్స్‌ అధికమైనా, వృద్ధి పరంగా వ్యాక్సిన్లు ముందున్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే వ్యాక్సిన్‌ ఎగుమతులు 24.59 శాతం పెరిగాయి. ఆఫ్రికా, ల్యాటిన్‌ అమెరికా దేశాలు వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. సర్జికల్స్‌ ఎగుమతులు 13.04 శాతం పెరిగాయి..ఫార్ములేషన్లు- బయోలాజికల్స్‌ 12.96 శాతం, బల్క్‌ డ్రగ్స్‌ 5.67 శాతం అధిక ఎగుమతులు నమోదు చేశాయి. ఆయుష్‌, హెర్బల్‌ ఉత్పత్తులు విభాగంలో వృద్ధి కనిపించలేదు.

తలుపులు తెరుస్తున్న డ్రాగన్‌!

చైనా అతిపెద్ద ఔషధ విపణి అయినా, మనదేశం నుంచి కొనుగోలు చేయడం తక్కువ. కానీ 2018-19తో పోలిస్తే, 2019-20 మొదటి త్రైమాసికంలో 37.17 శాతం, రెండో త్రైమాసికంలో 38.86 శాతం, మూడో త్రైమాసికంలో 31.91 శాతం ఎగుమతులు పెరిగాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించడమే ప్రధాన కారణం. భారతీయ కంపెనీలు చైనాలో సత్వర అనుమతులు సంపాదించేందుకు చైనాలోని ఔషధ నియంత్రణ సంస్థల అధికారులు, అక్కడి వాణిజ్య సంఘాలతో ఫార్మాగ్జిల్‌ సంప్రదింపులు జరపడం కలిసొచ్చింది.

మన ఔషధ ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు అమెరికాకే చేరుతున్నాయి. తదుపరి స్థానాల్లో దక్షిణాఫ్రికా, రష్యా, యూకే, జర్మనీ, బ్రెజిల్‌, నైజీరియా, కెనడా, నెదర్లాండ్స్‌ ఫ్రాన్స్‌ ఉన్నాయి. బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌ వంటి ఆసియా దేశాలూ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి.

‘కరోనా’ ప్రభావం లేదు

‘‘మనదేశం నుంచి ఔషధ ఎగుమతులపై కరోనా వైరస్‌ ప్రభావం ఇంత వరకు లేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనూ ఎగుమతులు బాగానే నమోదయ్యాయి. ఈనెల ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన ఔషధాల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీన్ని సమీక్షించాల్సిందిగా కోరాం. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. అందువల్ల జనవరి- మార్చి త్రైమాసికంలోనూ మా అంచనాలకు తగ్గట్లుగానే ఎగుమతులు ఉంటాయి.’’

- ఆర్‌.ఉదయ భాస్కర్‌, డైరెక్టర్‌ జనరల్‌, ఫార్మాగ్జిల్‌

.

India's drug exports worth Rs 1.8 lakh crore in 9 months
9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్ల విలువైన ఔషధ ఎగుమతులు

ఇదీ చూడండి: విలీన బ్యాంకుల అధిపతులతో నేడు సీతారామన్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.