ETV Bharat / business

'రెండు దశాబ్దాల్లో.. టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌' - జియో ప్లాట్‌ఫార్మ్స్‌

రాబోయే 20 ఏళ్లలో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్​ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ. ప్రజల తలసరి ఆదాయం కూడా రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

india will grow to be among top 3 economies in 2 decades ambani
'రెండు దశాబ్దాల్లో..టాప్‌-3 ఆర్థికవ్యవస్థల్లో భారత్‌'
author img

By

Published : Dec 15, 2020, 4:23 PM IST

రానున్న రెండు దశాబ్దాల్లో ‌ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరుల తలసరి ఆదాయమూ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఆన్‌లైన్‌ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. దేశంలో దాదాపు 50శాతానికి పైగా మధ్యతరగతి కుటుంబాలేనని.. ఏటా వీరి ఆదాయం మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతుందని అంబానీ అంచనా వేశారు.

"రానున్న రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో భారత్‌ నిలుస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నాను. యువకులు నడిపించే డిజిటల్‌ సొసైటీగా భారత్‌ మారబోతుంది. తలసరి ఆదాయం 1800-2000 డాలర్ల నుంచి 5వేల డాలర్లకు పెరుగుతుంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర కంపెనీలు, వ్యాపారవేత్తలు భారత ఆర్థికవ్యవస్థలో భాగస్వామ్యమై.. రానున్న దశాబ్దాల్లో జరిగే సామాజిక మార్పులో పాలుపంచుకోవడం సువర్ణావకాశం."

-- ముకేశ్​ అంబానీ.

ముకేష్‌ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో భారీ పెట్టుబడులు పెడుతోంది సోషల్‌ మీడియా దగ్గజం ఫేస్‌బుక్‌. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు రూ.33,737 కోట్లను చెల్లించి దాదాపు 7.7శాతం వాటాను సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి:'2020-21 వృద్ధి రేటు క్షీణత 7.7 శాతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.