ETV Bharat / business

సౌదీ చమురు దిగుమతుల్లో మూడోవంతు కోత!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా చమురు గిరాకీ తగ్గుతున్నందున ప్రత్యామ్నాయాలు బలోపేతం చేసుకోవాలని భారత్​ భావిస్తోంది. సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురులో మే నెలకు సంబంధించి మూడో వంతు మేర తగ్గించి, భారత రిఫైనరీలు దిగుమతి చేసుకోవాలని చూస్తోంది.

India to buy one-third less oil from Saudi Arabia
సౌదీ చమురులో మూడో వంతు కోత
author img

By

Published : Apr 7, 2021, 7:14 AM IST

సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురులో మే నెలకు సంబంధించి మూడో వంతు మేర తగ్గించి, భారత రిఫైనరీలు దిగుమతి చేసుకోనున్నాయి. మధ్యప్రాచ్యం వెలుపల నుంచి దిగుమతులు పెంచుకోవటంపై భారత్​ దృష్టి సారించటం ఇందుకు నేపథ్యం. కరోనా కేసలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా చమురుకు గిరాకీ తగ్గుతున్నందున ఇప్పుడే ప్రత్యామ్నాయాలు బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​లు విధిస్తున్నందున, మే నెలలో చమురుకు గిరాకీ తగ్గుతుందన్న అంచనాలున్నాయి.

సౌదీ అరేబియా నిర్లక్ష్యం

ఐఓసీతో పాటు ఇతర రిఫైనరీలు సౌదీ నుంచి నెలవారీగా చేసుకునే చమురు దిగుమతుల్లో సగటున 65 శాతం మాత్రమే మే నెలకు ఆర్డరు ఇవ్వనున్నట్లు ఈ అంశాలతో సంబంధమున్న ముగ్గురు సమాచారం అందించారు. ముడిచమురు ఉత్పత్తి పెంచి, ధరలు తగ్గేలా చూడమని భారత్ కోరినా, సౌదీ అరేబియా పెడచెవిన పెట్టడమూ ప్రస్తుత పరిమాణాలకు కారణం. ఉత్పత్తి కోతలపై ఆంక్షలు ఎత్తివేయటంపై సౌదీ అరేబియా నిర్లక్ష్యం వహిస్తుండటంతో, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని గత నెలలో ప్రభుత్వ రిఫైనరీలకు కేంద్రం సూచించిన విషయం విదితమే.

స్పాట్ మార్కెట్​పైనే..

సౌదీ అరేబియా ఇతర ఓపెక్​ దేశాలతో టర్మ్​ లేదా స్థిర పరిమాణ కాంట్రాక్టులు కుదుర్చుకోవాటానికి బదులు స్పాట్ లేదా కరెంట్​ మార్కెట్ నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయాలని ఐఓసీ, ఇతర కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. స్పాట్​ మార్కెట్లో ధరలు పతనమైతే ఆ ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది. దశాబ్దం కిందటితో పోలిస్తే మన చమురు సంస్థలు తమ స్పాట్ కొనుగోళ్లను 20 శాతం నుంచి 30-35 శాతం వరకు పెంచుకున్నాయి. ఇటీవల వారాల్లో గయనా నుంచి నార్వే వరకు.. కొత్తగా కొనుగోళ్లు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, కెనడా, పశ్చిమాఫ్రికా నుంచీ కొనుగోళ్లు పెంచారు.

తగ్గిన ఒపెక్ వాటా

ఏప్రిల్​ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు ఒపెక్ నుంచి భారత్​లోకి దిగుమతులు 74.4 శాతానికి తగ్గాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇవి 79.6 శాతంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిల్​ ధరలు భారీగా పెరిగి.. కరోనాతో దెబ్బతిన్న ఆర్థికంపై మరింత భారాన్ని మోపిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇదీ చదవండి : 1952 నుంచి ప్రతి ఎన్నికలో ఓటేసిన మారప్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.