ETV Bharat / business

అరేబియాలో చమురు యుద్ధం.. భారత్​కు లాభమేనా? - భారత్​కే లాభం

రష్యా, సౌదీ అరేబియా దేశాల మధ్య చమురు ఉత్పత్తుల విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల చమురు ధరలను తగ్గించింది సౌదీ. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనవైపు ప్రయాణిస్తున్నాయి. చమురు ధరలు తగ్గటం భారత్​కు కలిసొచ్చే అంశమైనా.. వినియోగించుకునే సామర్థ్యం దేశానికి ఉందా అనేది ప్రశ్నగా మిగిలింది.

India to benefit as Saudi Arabia, Russia crossing swords in global oil market
అరేబియాలో చమురు యుద్ధం.. భారత్​కే లాభం
author img

By

Published : Mar 9, 2020, 1:30 PM IST

భారత్‌ చేతి చమురు వదులుతోంది.. చమురు రేట్లు పెరిగిన ప్రతిసారీ ఈ మాటలు మనకు వినపడుతుంటాయి. కానీ, చమురు ఉత్పత్తిదారుల మధ్య నెలకొన్న పోటీలో భారత్‌ లబ్ధిదారుగా నిలిచే అవకాశం లభించింది. వాణిజ్యలోటును తగ్గించుకొనే సువర్ణావకాశం దక్కింది. చమురు ధర పెరిగితే భారత్‌ నష్టపోతుంది.. ధర తగ్గితే లాభపడుతుంది.. అసలే మందగమనంలో ఉన్న సమయంలో దేశంలో వాణిజ్యలోటు పెరగకుండా జాగ్రత్త పడాలి.. ఈ నేపథ్యంలో భారత్‌కు అనుకోని వరంలా అంతర్జాతీయ పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఒపెక్‌+రష్యా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా బ్రెంట్‌ చమురు ధర బ్యారెల్‌కు 33 డాలర్లకు తగ్గడం కలిసొచ్చే అంశంగా మారింది.

ఈ ఒపెక్‌ ఏమిటీ..

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌) ఆధ్వర్యంలో పెట్రోల్‌ ఉత్పత్తి చేసే దేశాలు ఒక సంఘంగా ఏర్పడి చమురు ఉత్పత్తి పెంచాలా..? తగ్గించాలా..? అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. చమురు డిమాండ్‌ తగ్గగానే ఉత్పత్తిని కూడా తగ్గించి ధరను కాపాడుకొంటాయి..! ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుడైన భారత్‌కు డిమాండ్‌ సూత్రం ప్రకారం ప్రయోజనం లభించాలి. కానీ, ఒపెక్‌ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధర నిలకడగా ఉండి.. అదే స్థాయిలో ధర చెల్లించాల్సి వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మన మార్కెట్లలో వ్యాపారులంతా సిండికేటై ధరను ఎలా నియంత్రిస్తారో.. ఒపెక్‌ కూడా అలానే చేస్తుంది.

చమురు మార్కెట్లకు వైరస్‌ భయం..

ఒపెక్‌లోని సౌదీఅరేబియా హవా కొనసాగుతోంది. ఈ దేశంతో భారత్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ, వ్యాపారం వేరు.. సంబంధాలు వేరు అన్నట్లే ఉంటుందీ వ్యవహారం. తాజాగా కరోనావైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు కర్మాగారాలు మూతపడ్డాయి. దీంతో ఉత్పత్తి తగ్గి రవాణా రంగంపై కూడా ప్రభావం పడింది. ఫలితంగా కర్మాగారాలకు, వాహనాలకు ఇంధన అవసరాలు తగ్గాయి. దీంతో చమురు ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది.

విభేదాలు ఇక్కడే..

ఈ నేపథ్యంలో ఒపెక్‌ గురువారం సమావేశమై ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది. 2020 చివరి వరకు 1.5 మిలియన్‌ పీపాలు లేదా 1.5శాతం తగ్గించాలని అనుకొంది. గత డిసెంబర్‌లో నిర్ణయించిన చమురు ఉత్పత్తి కోతకు ఇది అదనం. కానీ, అక్కడే కథ అడ్డం తిరిగింది. ఒపెక్‌ దేశాలతోపాటు చమురు ఉత్పత్తిలో అతిపెద్ద దేశమైన రష్యా దీనికి ససేమిరా అంటోంది. దీంతో ఇది సౌదీ అరేబియాకు ఇబ్బందికరంగా మారింది. చమురు బ్యారెల్‌కు 83డాలర్ల ధర లభిస్తేనే ఆ దేశ బడ్జెట్‌ అంచనాలను అందుకుంటుంది. మరోపక్క చమురు ధర బ్యారెల్‌కు 43 డాలర్ల కంటే తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో వియన్నాలో జరిగిన భేటీలో చమురు ఉత్పత్తి దేశాలు , రష్యా ఒక అవగాహనకు రాలేదు. సౌదీ అరేబియా చేసిన ప్రయత్నాలు మొత్తం ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఎక్కువ చమురు తక్కువ ధరకు విక్రయించి లాభం సొంతం చేసుకోవాలని సౌదీ ప్రణాళిక వేసినట్లు అంతర్జాతీయ పత్రికలు పేర్కొంటున్నాయి.

ఢీకొట్టేందుకు సిద్ధమైన సౌదీ

ఉత్పత్తి తగ్గింపు ఒప్పందం ఖరారుకాకపోవడంతో తానే భారీగా ఉత్పత్తి పెంచేసి తీవ్రమైన ధరపోరుకు తెరతీయాలని సౌదీ భావిస్తోంది. రష్యాతో పోల్చుకుంటే సౌదీ అరేబియాకు చమురు రవాణా మార్గాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. ఫలితంగా దశాబ్దకాలంలో ఎన్నడూ పడనంతగా చమురు ధరలు పతనం అయ్యాయి. ముఖ్యంగా యూరప్‌, తూర్పుదేశాలకు, అమెరికాలోని రిఫైనరీలకు తక్కువ ధరకే చమురు అమ్మి డిమాండ్‌ను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. అవసరమైతే రికార్డు స్థాయిలో 12మిలియన్‌ బ్యారెళ్లకు చమురు ఉత్పత్తి చేర్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రోజుకు 9.7 మిలియన్‌ బ్యారెళ్లకు చేరగా.. ఏప్రిల్‌ నాటికి 10 మిలియన్‌ బ్యారెళ్లను దాటే అవకాశం ఉంది. రష్యాను లొంగదీసి.. చర్చలకు వచ్చేలా చేయడానికి ఇదొక్కటే సౌదీ ముందున్న మార్గం.

భారత్‌, చైనాలకు లాభం..

మరోపక్క భారత్‌, చైనా వంటి భారీ చమురు దిగుమతిదారులు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకొనేలా సౌదీ నిర్ణయం ఊరిస్తోంది. ఇప్పటికే చైనా వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవడానికి భారీగా నిధులను వెచ్చిస్తోంది. 2018-19లో భారత్‌ 207.3 మిలియన్‌ టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకొంది. అప్పట్లో చమురు ధర కూడా ఎక్కువగా ఉంది. కానీ, ఇప్పుడు ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా బ్యారెల్‌కు 46 డాలర్ల దిగువకు చమురు ధర పడిపోవడంతో భారత్‌కు కలిసొచ్చింది. ఆర్థికంగా కష్టకాలంలో విదేశీమారక ద్రవ్యం ఆదాకావడంతోపాటు.. చమురు అవసరాలు కూడా సమర్థంగా తీరుతాయి.

రూపాయికి ఊరట..!

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పతనం అవుతోంది. ప్రస్తుతం డాలర్‌కు రూ.74 వద్ద దీని విలువ ఉంది. మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు వెళుతుండటం.. ఆర్థిక మందగమనం కారణంగా లాభాలు తగ్గి పెట్టుబడులు ఉపసంహరిస్తుండటంతో డాలర్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. ఈ కష్టకాలంలో చమురు ధరలు తగ్గడంతో రూపాయి విలువ పతనాన్ని కొంత తగ్గించింది. లేకపోతే రూపాయి విలువ మరింత పతనం అయ్యేది.

భారత్‌ లాభపడుతుందా..

భారత్‌ ఈ పరిణామాలను సమర్థంగా వినియోగించుకోవాలంటే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం భారత్‌లో మంగళూరు, ఉడిపి, విశాఖ వద్ద వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం రెండువారాలు దేశ పెట్రోలియం అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. వీటి సామర్థ్యం 3.7కోట్ల పీపాల వరకు ఉంటుంది. భారత్‌ వంటి పెద్దదేశానికి ఇది చాలా తక్కువ. జపాన్‌ మన కంటే చాలా చిన్నది దీనికి 32 కోట్ల పీపాలకుపైగా నిల్వ చేసుకొనే సామర్థ్యం ఉంది. ఇక చైనా అయితే ఏకంగా రెండు విభాగాల్లో 68 కోట్ల పీపాలకు పైగా చమురును వ్యూహాత్మకంగా నిల్వ చేసుకొనే ప్రణాళికను శరవేగంగా అమలు చేస్తోంది. ఇది చైనా 60 రోజుల అవసరాలను తీర్చగలుగుతుంది. అదే అమెరికాలో కూడా 60రోజుల దేశ అవసరాలు తీర్చేలా నిల్వలు ఉంచుకొంది. పైగా ఆ దేశం అత్యధికంగా షెల్‌చమురు ఉత్పత్తి కూడా చేస్తుంది. రష్యా పరిస్థితి కూడా ఇంతే. భారత్‌కు మాత్రం వ్యూహాత్మక చమురు నిల్వల సామర్థ్యం రెండువారాలకు మాత్రమే సరిపడా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అత్యధిక పెట్రోలియం వ్యూహాత్మక నిల్వలు కలిగిన దేశాల్లో భారత్‌లేదు. జనాభాలో.. పెట్రోలియం వినియోగంలో మాత్రం మనం ముందున్నాం. చమురు ధరల పతనం వంటి సువర్ణావకాశాలు వచ్చినా భారత్‌ దానిని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొనే పరిస్థితి లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.