ETV Bharat / business

మీడియా విపణిలో భారత్‌ హవా: అసోచామ్‌ - per capita media

వినోద, ప్రసార మాధ్యమ విపణిలో 2021 నాటికి భారత్​ 10 అగ్రశ్రేణి దేశాల్లో ఒకటిగా ఉంటుందని అసోచామ్​-పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది.

మీడియా విపణిలో భారత్‌ హవా: అసోచామ్‌
author img

By

Published : Apr 1, 2019, 9:47 AM IST

అంతర్జాతీయంగా 'వినోద- ప్రసార మాధ్యమ' (మీడియా) విపణిలో భారత్ హవా కొనసాగుతోంది. 2021 నాటికి భారత్​ 10 అగ్రశ్రేణి విపణిల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్​-పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది.

అసోచామ్​-పీడబ్ల్యూసీ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు:

* మీడియా- వినోద రంగంపై దేశ తలసరి వ్యయం 2021 నాటికి 32 డాలర్లు (రూ.2,080)కు చేరే అవకాశం ఉంది.

* ప్రపంచంలోనే ఓటీటీ ( కోరుకున్న వీడియోల వీక్షణ ) విపణిలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్​ ఒకటి. ప్రధానంగా స్మార్ట్​ఫోన్ల వినియోగం దేశంలో బాగా పెరగడం, డేటా ఛార్జీలు తగ్గడం ఓటీటీ కంటెంట్​ వృద్ధికి దోహదపడుతున్నాయి. 2017లో 30.36 బిలియన్లుగా ఉన్న ఈ మార్కెట్​ విలువ 2022 నాటికి​ 52.68 బిలియన్లకు చేరుకుంటుందని అసోచామ్​ అంచనా.

* అంతర్జాతీయంగా ఓటీటీ మార్కెట్ 2017-22 మధ్య కాలంలో 10.1 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్​) సాధించే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్​​ ఈ విభాగంలో ప్రస్తుతం 297 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2022 నాటికి 823 మిలియన్​ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అంటే సుమారు 22.6 శాతం వార్షిక వృద్ధి సాధిస్తుందని అసోచామ్​ అంచనా వేసింది. వీడియో ఆన్​ డిమాండ్​ (వీఓడీ) విభాగంలో జరుగుతున్న వృద్ధి దీనికి ప్రధాన కారణం.

* వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కంటెంట్ అందించే దృక్పథం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమ ఈ దృష్టి కోణంలో ముందుకు సాగుతోంది.

* భారత్​లో వీడియో ఆన్ డిమాండ్​ విభాగంలో ఎంపిక అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. ప్రధానంగా హాట్​స్టార్​, అమెజాన్ ప్రైమ్​, ఎరోస్​ నౌ తదితర సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. ఇవి పరస్పరం పోటీ పడుతూనే, డీటీహెచ్​ సంస్థలతోనూ పోటీ పడాల్సి వస్తోంది.

* 2021 నాటికి భారత్​ ప్రసార మాధ్యమాలు, వినోద రంగ తలసరి వ్యయం రూ.2,080 ఉండొచ్చు. చైనాలో రూ.14,430లు, అమెరికాలో రూ.1.46 లక్షలతో పోల్చితే భారత్​లో మరింత చౌకగా ఈ సేవలు లభించనున్నాయి.

ఇదీ చూడండి:భారత్​లో నిరుద్యోగమే అతిపెద్ద సవాలు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.