ETV Bharat / business

'పన్ను పారదర్శకత వైపు భారత్​ అడుగులు'

ఒడిశా కటక్​లో నిర్మించిన ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్​ భవనం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పన్ను ఉగ్రవాదం నుంచి పన్ను పారదర్శకతవైపు దేశం అడుగులు వేస్తోందన్నారు. పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం కలిగించకూడదని ఐటీ అధికారులకు సూచించారు మోదీ.

india-moving-from-tax-terrorism-to-tax-transparency-pm-modi
పన్ను పారదర్శకతవైపు భారత్​ అడుగులు: మోదీ
author img

By

Published : Nov 11, 2020, 5:32 PM IST

భారత దేశం.. పన్ను 'ఉగ్రవాదం' నుంచి పన్ను 'పారదర్శకత' వైపు అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. వివాదాల పరిష్కరణ వ్యవస్థను ప్రభుత్వం మెరుగుపరచడమే ఇందుకు కారణమన్నారు. ఒడిశా కటక్​లో నిర్మించిన ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్​ భవనం ప్రారంభోత్సవంలో ఆన్​లైన్​ ద్వారా పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

పన్ను చెల్లింపుదారులు.. రీఫండ్​ కోసం ఇకపై ఏళ్ల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారులను అధికారులు అసౌకర్యానికి గురిచేయకూడదన్నారు. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను గుర్తించే దేశాల్లో భారత్​ ఒకటని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, కేంద్రమంత్రులు రవి శంకర్​ ప్రసాద్​, ధర్మేంద్ర ప్రధాన్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- ఎల్​టీసీ క్యాష్ ఓచర్​పై కేంద్రం మరింత స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.