ETV Bharat / business

Piyush goyal: 'రికార్డ్​ స్థాయి ఎగుమతుల దిశగా భారత్' - భారత్​ ఎగుమతులు

అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను కొనసాగించడంలో భారత్‌ను ప్రపంచ దేశాలు నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్(Piyush goyal) పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని, దేశ వస్తు సేవల ఎగుమతులు రికార్డు గరిష్ఠాలకు చేరే క్రమంలో ఉన్నాయని తెలిపారు.

Piyush goyal
పీయూశ్ గోయల్
author img

By

Published : Nov 15, 2021, 7:10 AM IST

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని, దేశ వస్తు సేవల ఎగుమతులు రికార్డు గరిష్ఠాలకు చేరే క్రమంలో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌(Piyush goyal) పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి భారత ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.30 లక్షల కోట్లు)కు చేరే అవకాశం ఉందని అన్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌)(India international trade fair 2021) ప్రారంభోత్సవం సందర్భంగా గోయల్‌(Piyush goyal) మాట్లాడారు.

"ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అత్యధికంగా 27 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఏడాదిక్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇవి 62 శాతం అధికం. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను కొనసాగించడంలో భారత్‌ను ప్రపంచ దేశాలు నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా చూస్తున్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్‌ ఎటువంటి సేవలు అందించడంలో వెనకబడలేదు."

-పీయూశ్ గోయల్​, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి

'ఎఫ్‌టీఏలతో భారత వస్తువులకు గిరాకీ'

ఆస్ట్రేలియా, బ్రిటన్‌, యూఏఈ సహా పలు దేశాలతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) చర్చలు వేగంగా సాగుతున్నాయని గోయల్‌(Piyush goyal) అన్నారు. ఇవి అమలు చేస్తే దేశీయ ఉత్పత్తులు మరిన్ని విపణులకు చేరేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గల్ఫ్‌ కోపరేషన్‌ కౌన్సిల్‌, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌తో సైతం ఒప్పంద చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

'ప్రపంచ ఫ్యాషన్‌ హబ్‌గా భారత్‌'

దేశంలో ఫ్యాషన్‌ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోందని, ప్రపంచ ఫ్యాషన్‌ హబ్‌గా భారత్‌ అవతరించే సత్తా ఉందని గోయల్‌(Piyush goyal) అభిప్రాయపడ్డారు. నేత కార్మికులు, కళాకారుల సాయంతో సొంతంగా ఎదిగే అవకాశం ఉందన్నారు. దిల్లీ నిఫ్ట్‌ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. మార్కెట్‌తో చేతి వృత్తుల వారిని నిఫ్ట్‌ విద్యార్థులు కలుపుతున్నారని తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.