దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనంపై వార్షిక నివేదికలో స్పష్టతనిచ్చింది భారత రిజర్వు బ్యాంక్. దేశంలో ఏర్పడిన ఆర్థిక మందగమనం తరుచూ వచ్చేదేనని స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం అధికంగా ఉండేలా విధానాలు తయారుకావాలని అభిప్రాయపడింది.
15 శాతం పెరిగిన ఆర్థిక మోసాలు..
బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. మోసాల మొత్తం విలువ 73.8 శాతం పెరిగిందని పేర్కొంది. 2018-19లో 71,542 కోట్ల రూపాయల విలువైన 6,801 మోసాలు జరిగాయని ఆర్బీఐ పేర్కొంది. అంతకముందు సంవత్సరంలో 41,167 కోట్ల రూపాయల విలువైన 5,916 మోసాలు నమోదైనట్లు తెలిపింది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా ఈ ఏడాది మార్చి వరకు దేశంలో చలామణీలో ఉన్న నగదు 17 శాతం పెరిగి 21.10 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది ఆర్బీఐ. చలామణీలో ఉన్న మొత్తం నగదులో 51 శాతం 500 రూపాయల నోట్లేనని వివరించింది.
ఇదీ చూడండి:'కశ్మీర్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాక్ మానుకోవాలి'