ETV Bharat / business

ఆదాయపు పన్ను 'టీడీఎస్' ఫారమ్‌లో మార్పులు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయపు పన్ను టీడీఎస్​ ఫారమ్​లో మార్పులు చేసింది. పన్ను టీడీఎస్​ను ఎందుకు చెల్లించడం లేదో వెల్లడించేలా మరింత సమగ్రంగా దీనిని మార్చింది.

TDS-form
టీడీఎస్ ఫారమ్‌లో మార్పులు
author img

By

Published : Jul 5, 2020, 10:26 PM IST

ఆదాయపుపన్ను శాఖ టీడీఎస్‌ ఫారమ్‌లో మార్పులు చేసింది. దీనిని మరింత సమగ్రంగా మార్చింది. పన్ను టీడీఎస్‌ను ఎందుకు చెల్లించడం లేదో దీనిలో వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్యాంకులు కూడా రూ.కోటి కంటే ఎక్కువ విత్‌డ్రాలపై టీడీఎస్‌ రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఇప్పటికే ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చేసింది. వీటిల్లో ఇ-కామర్స్‌ ఆపరేటర్లను కూడా చేర్చింది. దీంతోపాటు మ్యూచివల్‌ ఫండ్స్‌ డివిడెండ్స్‌ పంపిణీ, బిజినెస్‌ ట్రస్ట్‌లు, నగదు విత్‌డ్రాలు, ప్రొఫెషనల్‌ ఫీజులు, వడ్డీలు వంటి అంశాలను చేర్చారు.

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఫారమ్‌ 26 క్యూ, 27 క్యూలో మార్పులు చేసింది. 26క్యూ ఫారమ్‌ల్లో భారత్‌లోని ప్రభుత్వ, కార్పొరేట్‌ ఉద్యోగికి జీతం కాకుండా చేసిన చెల్లింపులను దీనిలో నమోదు చేసి ప్రతి మూడు నెలలకు ఒక సారి సమర్పించాలి. ఫారమ్‌ 27క్యూలో ఎన్నారైలు, విదేశీయులకు చేసిన చెల్లింపులు చెప్పాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: డీమ్యాట్​ ఖాతా తెరవాలా.. వీటిని ట్రై చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.