ETV Bharat / business

కరోనా ఆంక్షలతో వాహన విక్రయాలు ఢమాల్! - ద్విచక్ర వాహన విక్రయాలు

కరోనా సంక్షోభంతో వాహన విక్రయాలు భారీగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 29.85శాతం తగ్గాయని తెలిపింది. ఇది గత ఎనిమిదేళ్లలో ఇదే కనిష్ఠమని పేర్కొంది.

In Covid-19 year, vehicle registrations in India slips 30%
కరోనాతో వాహన విక్రయాలు ఢమాల్!
author img

By

Published : May 10, 2021, 5:29 PM IST

ఏడాది కాలంగా ఎదుర్కొంటున్న ఒడుడొడుకులకు తోడు.. రెండోదశ కరోనా విజృంభణతో వాహన రంగం కుదైలైంది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ప్రకారం 2019-20లో 2.17 కోట్ల వాహనాలు అమ్ముడవ్వగా.. 2020-21లో 1.53 కోట్లకు పడిపోయాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం వాహన రిజిస్ట్రేషన్లు ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి(29.85శాతం)కి పడిపోయినట్లు ఫాడా తెలిపింది.

కేటగిరీల వారీగా తగ్గిన విక్రయాలు..

  • 2019-20లో 23,86,316 ప్రయాణీకుల వాహన విక్రయాలు జరగ్గా.. 2020లో 13.96శాతం తగ్గి.. 27,73,514యూనిట్లకు చేరాయి.
  • ద్విచక్ర వాహన అమ్మకాలు 31.51 శాతం తగ్గి 1,15,33,336 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 68,38,965 యూనిట్లు అమ్ముడయ్యాయి.
  • త్రీ-వీలర్ రిజిస్ట్రేషన్లు 64.12 శాతం క్షీణించి 2,58,174 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020లో ఇవి 7,19,594 అమ్ముడైనట్లు ఫాడా నివేదిక స్పష్టం చేస్తోంది.
  • వాణిజ్య వాహన రిజిస్ట్రేషన్లు 49.05శాతం క్షీణించి.. 4,48,914 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 8,81,114 యూనిట్లుగా నమోదయ్యాయి.
  • గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ట్రాక్టర్ల అమ్మకాలు 16.11 శాతం పెరిగి 6,44,779 యూనిట్లకు చేరుకున్నాయి. 2019-20లో 5,55,315 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో లాక్​డౌన్​ తరహా ఆంక్షల అమలుతో డీలర్​షిప్ అవుట్​లెట్లు మూసివేయాల్సి వచ్చినందున అమ్మకాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల రాకపైనే అమ్మకాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ఏడాది సగటు వర్షపాతం నమోదవుతుందనే ప్రకటనలతో.. వ్యవసాయ దిగుబడులపై అంచనాలు పెరిగాయి. ఫలితంగా పట్టణాలతో పోలిస్తే గ్రామీణ మార్కెట్లు వేగంగా కోలుకుంటాయి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకుంటాయనే నమ్మకం ఉంది.

-ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా)

ఇవీ చదవండి: మార్చిలో ప్రయాణికుల వాహనాల సేల్స్​ అదుర్స్​

ఆశల పద్దు: 'తుక్కు పాలసీతో 'ఆటో'కు నయా జోష్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.