ETV Bharat / business

వాట్సాప్ ఇలా వాడుతున్నారా? అయితే బ్లాక్ అవ్వడం ఖాయం! - బిజినెస్ న్యూస్​ టుడే

'మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేశాం' అని వాట్సాప్ సందేశం వచ్చిందా? అయితే మీరు ఉపయోగిస్తున్నది ఒరిజినల్ వాట్సాప్ యాప్ కాదని అర్థం. ఈ సందేశం తర్వాత కూడా థర్డ్​ పార్టీ యాప్స్​ ద్వారా వాట్సాప్​ను ఉపయోగించడం ఆపకపోతే.. మీ ఖాతా శాశ్వతంగా నిలిచిపోతుందని సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. మరి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

if-you-dont-switch-to-the-official-whatsapp-app-after-being-temporarily-banned-your-account-might-be-permanently-banned
వాట్సాప్ ఇలా వాడుతున్నారా? అయితే బ్లాక్ అవ్వడం ఖాయం!
author img

By

Published : Jul 7, 2021, 3:34 PM IST

థర్డ్ పార్టీ యాప్స్​ను తాము సపోర్ట్​ చేయమని ఫేస్​బుక్​కు చెందిన ప్రముఖ మెసెంజర్ వాట్సాప్​ స్పష్టం చేసింది. వీటి వల్ల భద్రతా ప్రమాణాలను ధ్రువీకరించడం సాధ్యం కాదని పేర్కొంది. అందుకే అధికారిక యాప్ కాకుండా వాట్సాప్​ ప్లస్, జీబీ వాట్సాప్​ వంటి అనధికారిక యాప్స్​ ఉపయోగించేవారికి 'మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేశాం' అనే సందేశం పంపుతోంది దిగ్గజ మెసెంజర్​. ఈ సందేశాలు పలుమార్లు పంపినా అధికారిక వాట్సాప్​ను డౌన్​లోడ్​ చేసుకోని యూజర్ల ఖాతాలు శాశ్వతంగా బ్యాన్​ అయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు ఉపయోగిస్తున్న వాట్సాప్​ అధికారికమో కాదో ఓ సారి చెక్ చేసుకోండి. మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేశాం' అని సందేశం వస్తే మాత్రం అది థర్డ్ పార్టీ యాప్ అని అర్థం.

వాట్సాప్​ ప్లస్, జీబీ వాట్సాప్ సహా ఇతర అన్​సపోర్టెడ్ యాప్స్​.. మీ చాట్​ బ్యాకప్​ను వేరే ఫోన్​కు ట్రాన్స్​ఫర్​ ​ చేసుకోండని తరచూ సూచిస్తుంటాయి. ఇలాంటివన్నీ వాట్సాప్​ అనధికారిక వెర్షన్లు. వీటిని థర్డ్ పార్టీలు అభివృద్ధి చేస్తుంటాయి. వాట్సాప్​ షరతులు, విధానాలకు ఇవి విరుద్ధం. అందుకే అలాంటి యాప్స్ ఉపయోగించవద్దని వాట్సాప్​ పదే పదే యూజర్లను హెచ్చరిస్తూనే ఉంది. అలాంటి సందేశాలు వచ్చిన వెంటనే మీరు అధికారిక వాట్సాప్​ను ప్లే స్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవటం ఉత్తమం.

థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించే వారు ఏం చేయాలి..?

థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించేవారు అధికారిక వాట్సాప్​ను డౌన్​లోడ్ చేసుకోవడానికి ముందు మీ చాట్​ బ్యాకప్​ తీసుకోవాలి. మీ చాట్​ను ట్రాన్స్​ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో థర్డ్ పార్టీ యాప్ పేరును బట్టి వాట్సాప్ సూచిస్తుంది. అయితే ఈ ప్రక్రియ కచ్చితంగా విజయవంతం అవుతుందని మాత్రం చెప్పలేమని వాట్సాప్​ స్పష్టం చేసింది.

జీబీ వాట్సాప్​ యూజర్లు ఏం చేయాలంటే?

  • థర్డ్ పార్టీ యాప్​ జీబీ వాట్సాప్ ఉపయోగించే యూజర్లు.. మోర్​ ఆప్షన్​లోకి వెళ్లి చాట్స్​లో బ్యాకప్​ చాట్స్​పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఫోన్ సెట్టింగ్స్​లోకి వెళ్లి స్టోరేజీలో ఫైల్స్ సెలక్ట్ చేసుకోవాలి.
  • జీబీ వాట్సాప్​ ఫోల్డర్​ను సెలక్ట్​ చేసి హోల్డ్ చేయాలి.
  • మోర్ ఆప్షన్ ఎంపిక చేసి ఫోల్డర్ పేరును WhatsApp గా రీనేమ్ చేయాలి.
  • అనంతరం ప్లే స్టోర్​కు వెళ్లి అధికారిక వాట్సాప్​ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఫోన్​ నంబర్​ వెరిఫై చేసుకున్నాక.. రీస్టోర్​పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ పాత చాట్ మొత్తం వస్తుంది.

వాట్సాప్ ప్లస్ యూజర్లు..

వాట్సాప్​ ప్లస్ యూజర్లు మీ చాట్ హిస్టరీని సేవ్ చేసుకుంటే అది ఆటోమేటిక్​గా అధికారిక వాట్సాప్​కు ట్రాన్స్​ఫర్ అవుతుంది. ప్లే స్టోర్​ నుంచి అఫీషియల్ వాట్సాప్ డౌన్​లోడ్ చేసుకున్నాక మీ ఫోన్​ నంబర్ వెరిఫై చేసుకుంటే మీ పాత చాట్ మొత్తం వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.