ETV Bharat / business

మూడు నెలల్లో 44% పెరిగిన ఇళ్ల విక్రయాలు

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు జోరందుకున్నట్లు ఓ సంస్థ తెలిపింది. కేవలం మూడు నెలల వ్యవధిలో 44 శాతం మేర పెరిగినట్లు తన నివేదికలో పేర్కొంది.

Housing sales up 44 pc in Jan-Mar 2021 across 8 cities: Report
మూడు నెలల్లో 44 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు
author img

By

Published : Apr 6, 2021, 12:53 PM IST

Updated : Apr 6, 2021, 1:10 PM IST

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి మధ్యలో ఇళ్ల విక్రయాలు సుమారు 44 శాతం పెరిగాయని నైట్​ ఫ్రాంక్​ ఇండియా అనే సంస్థ తెలిపింది. ముంబయి మెట్రోపాలిటన్​ రీజియన్​, పుణె నగరాలు ఈ వరుసలో ముందున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్​ డ్యూటీని తగ్గించడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 71 వేల 963 ఇళ్లు అమ్ముడైనట్లు నైట్​ ఫ్రాంక్​ ఇండియా తెలిపింది. గతేడాదితో పోల్చితే 44 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. ఇది స్థిరాస్తి మార్కెట్​కు శుభ సూచికమన్న సంస్థ.. ఈ గణాంకాలు మరిన్ని ప్రాజెక్ట్​లకు ఊతం ఇచ్చినట్లు పేర్కొంది.

గృహ రుణాలు ప్రస్తుతం అత్యంత తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది సొంతింటి బాట పడుతున్నారని నైట్​ ఫ్రాంక్​ ఇండియా తెలిపింది.

నగరం అమ్ముడైన ఇళ్లువృద్ధి(శాతం)
ముంబయి 23,75249
పుణె13,653 75
బెంగళూరు10,219 18
హైదరాబాద్​6,90981
దిల్లీ6,73124
చెన్నై4,05836
కోల్​కత్తా3,59622
అహ్మదాబాద్​3,04534

ఇదీ చూడండి: ఎస్​బీఐ షాక్​- హోం లోన్​ వడ్డీ రేట్లు పెంపు

Last Updated : Apr 6, 2021, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.