ETV Bharat / business

క్యూ1లో 21 శాతం పెరిగిన ఇళ్ల విక్రయాలు! - ఇళ్ల విక్రయాలపై లాక్​డౌన్ ప్రభావం

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు(2020తో ఇదే సమయంతో పోలిస్తే) 21 శాతం పెరిగాయి. కోల్​కతా మినహా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్​, ముంబయి, దిల్లీ, పుణె నగరాల్లో ఇళ్ల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు ఓ నివేదికలో వెల్లడైంది.

Hosing sales in Jan-march
పెరిగిన ఇళ్ల విక్రయాలు
author img

By

Published : May 17, 2021, 7:40 PM IST

దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి-మార్చి (గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే) మధ్య 21 శాతం పెరిగాయి. ఇదే సమయంలో కొత్త ఇళ్ల సప్లయి మాత్రం 40 శాతం తగ్గినట్లు ప్రాప్​ఈక్విటీ సంస్థ నివేదికలో వెల్లడైంది.

కరోనా రెండో దశ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా విధించిన పాక్షిక, సంపూర్ణ లాక్​డౌన్​ల కారణంగా ఏప్రిల్​-జూన్​ మధ్య డిమాండ్​ మందగించే అవకాశముందని తెలిపిందీ నివేదిక.

2021 జనవరి-మార్చి మధ్య ఇళ్ల విక్రయాలు ఇలా..

  • మొత్తం 1,05183 ఇళ్లు విక్రయమయ్యాయి. 2020 క్యూ1లో ఈ సంఖ్య 87,236గా ఉండటం గమనార్హం.
  • కొత్తగా 59,737 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,00,343గా ఉంది.
  • బెంగళూరు, చెన్నై, హైదరాబాద్​, ముంబయి, దిల్లీ, పుణె నగరాల్లో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. కోల్​కతాలో మాత్రం 20 శాతం విక్రయాలు పడిపోయాయి.

ఇదీ చదవండి:జీవితకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.