కరోనా ప్రభావం దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. దిల్లీ ముంబై, పుణె, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై నగరాల్లో భవన నిర్మాణాలు, అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ 'అనరాక్' తన వార్షిక నివేదికలో తెలిపింది. 2019లో ఈ ఏడు నగరాల్లో 2.61లక్షల ఇళ్లు అమ్ముడవగా.. 2020లో 1.38లక్షల గృహాలు మాత్రమే విక్రయించినట్లు వెల్లడించింది.
2019లో కొత్తగా కట్టిన ఇళ్లు 2.37లక్షలు అమ్ముడవగా.. ఈ ఏడాది 46శాతం తగ్గి 1.28లక్షల అమ్మకాలు జరిగినట్టు తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి ఇళ్లపై ప్రకటిస్తున్న డిస్కౌంట్లు, సులభతర ఈఎంఐల వెసులుబాటుతో నివాస గృహాల అమ్మకాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతోందని ప్రకటించింది.
2020.. రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత గడ్డు సంవత్సరం. ప్రస్తుతం నివాస గృహాల అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇది ఆశించదగిన పరిణామం.
-అనుజ్ పూరీ, అనరాక్ ఛైర్మన్.
నగరాల వారీగా..
- ముంబయిలో గతేడాది 80,870ఇళ్లు అమ్ముడవగా.. 2020డిసెంబర్ వరకు 45శాతం తగ్గి 44,320మాత్రమే అమ్ముడయ్యాయి.
- బెంగళూరు నగరంలో ప్రస్తుతం 51శాతం తగ్గి 24,910 నివాస సముదాయాలు అమ్మకాలు సాగించగా.. 2019లో 50,450యూనిట్లు విక్రయించారు.
- పూణెలో 2019లో 42శాతం తగ్గి ఈ ఏడాది 23,460ఇళ్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి.
- ఇక హైదరాబాద్లో 48శాతం తగ్గి 8,560 ఇళ్లకు పరిమితమవ్వగా.. కోల్కతాలో 49క్షీణతతో 7,150గృహాలు మాత్రమే విక్రయించారు.
ఇదీ చదవండి: స్టాక్‌మార్కెట్లపై 'స్ట్రెయిన్' ప్రభావం- సెన్సెక్స్ 1500-