ETV Bharat / business

2020-21లో ఇళ్ల విక్రయాలు 34% డౌన్!

దేశీయంగా గృహ విక్రయాలు 2020-21లో 34 శాతం తగ్గొచ్చని ఫిచ్​ అనుబంధ సంస్థ ఇండియా రేటింగ్స్​ తాజా నివేదికలో వెల్లడించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం మళ్లీ డిమాండ్ సాధారణ స్థితికి చేరొచ్చని అంచనా వేసింది. మారిన ఈ పరిస్థితులను తట్టుకునే శక్తి గ్రేడ్​ 1 స్థిరాస్తి సంస్థలకు ఉందని వెల్లడించింది.

Housing sales may drop 34 pc in this Fiscal
ఇళ్ల విక్రయాలపై కరోనా కాటు
author img

By

Published : Mar 10, 2021, 6:36 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశంలో గృహ విక్రయాలు (సంఖ్య పరంగా) 34 శాతం తగ్గొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. అయితే 2021-22లో మాత్రం డిమాండ్​ 30 శాతం మేర పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

రెసిడెన్సియల్ రియల్​ ఎస్టేట్ రంగం వచ్చే ఆర్థిక సంవత్సరం K-ఆకారపు రికవరీని నమోదు చేసే అవకాశమున్నట్లు రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ఈ విభాగంలో విక్రయాలు 2021-22లో(ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే) 14 శాతం తక్కుగానే నమోదుకావచ్చని పేర్కొంది. '2020-21లో ఫ్లోర్​ ప్లేస్​ విక్రయాలు ఏకంగా 41 శాతం తగ్గాయి. పూర్తి ఏడాదికి ఈ మొత్తం 34 శాతంగా నమోదు కావచ్చు' అని తెలిపింది.

మారిన పరిస్థితులను రియల్టీ మార్కెట్లోని గ్రేడ్​ 1 సంస్థలు తట్టుకోగలవని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. పెద్ద సంస్థల విక్రయాలు 2020-21లో 14 శాతం పడిపోయి.. 2021-22లో 49 శాతం పెరుగుతాయని అంచనా వేసింది.

గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు.. ఇళ్ల కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచే వీలుందని ఇండియా రేటింగ్స్​ వివరించింది.

ఇదీ చదవండి:ఐపీఎల్ బ్రాండ్ విలువ 3.6% డౌన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.