ఏపీ శాసనసభలో హెరిటేజ్ షేర్ విలువపై ఆ రాష్ట్ర సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై హెరిటేజ్ ఫుడ్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన కంపెనీ షేర్ విలువ పెరగటం, తగ్గటం అనేది... కంపెనీ పనితీరు, పెట్టుబడిదారులు సంస్థపై చూపే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది తప్ప.. అధికారంతో సంబంధం ఉండదని స్పష్టం చేసింది. సభలో ఆరోపణ చేసినట్లు ఉద్దేశపూర్వకంగా షేర్ వాల్యు రిగ్గింగ్ చేయరాదని... అది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నియంత్రణలోని అంశమని గుర్తించాలని పేర్కొంది.
ఒక నమ్మకమైన, పారదర్శకమైన వ్యాపార సంస్థగా హెరిటేజ్ ఫుడ్స్ తన విలువ ఎప్పటికీ నిలబెట్టుకుంటుందని.. బ్రాండ్ వాల్యూ పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కే యాజమాన్యం తమది కాదని స్పష్టం చేసింది. విలువలతో కూడిన వ్యాపార సంస్థగా రాణిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ పై రాజకీయ దురుద్దేశంతో దుష్ప్రచారం చేయవద్దని కోరింది.
ఇదీ చదవండి : ఆశల పల్లకీలో... గ్రేటర్ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ!