ETV Bharat / business

14న జీఎస్టీ మండలి భేటీ.. చర్చించే అంశాలివే! - వ్యాపార వార్తలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన ఈ నెల 14న జీఎస్టీ మండలి సమావేశంకానుంది. ఈ సమావేశంలో పలు రంగాల పన్ను రేట్లు హేతుబద్దీకరణ సహా నెటవర్క్​ పోర్టల్​ సమస్యలు చర్చకు రానున్నాయి.

GST COUNCIL NEWS
జీఎసీ వార్తలు
author img

By

Published : Mar 11, 2020, 10:53 PM IST

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి సమావేశం ఈ నెల 14న జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన అధికారులు భేటీకానున్నారు. ఈ సారి సమావేశంలో మొబైల్​ఫోన్లు, ఫుట్​వేర్​, టెక్స్​టైల్స్ సహా మొత్తం ఐదు రంగాలపై పన్ను రేట్లు హెతుబద్దీకరించడంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

కొత్త రిటర్ను వ్యవస్థ, ఈ-ఇన్​వాయిస్​ల అమలను వాయిదా వేసే అశంపై ఈ భేటీలో చర్చించొచ్చని సమాచారం.

జీఎస్టీ నెట్​వర్క్ పోర్టల్​లోని సమస్యలపై చర్చించి.. ఇన్ఫోసిస్​ నుంచి వాటికి పరిష్కారాలు కనుక్కోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీ నెట్​వర్క్​ను ఇన్ఫోసిస్​ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని చర్చాంశాలు..

జీఎస్టీ ఎగవేతలను ట్రాక్​ చేసేందుకు ఏప్రిల్​ నుంచి జీఎస్టీ ఈ-బిల్లు వ్యవస్థను ఎన్​హెచ్​ఏఐకి చెందిన ఫాస్టాగ్​ మెకానిజంతో అనుసంధానం చేసే అంశమూ ఈ సారి చర్చకు రానుంది.

ఆధార్​తో జీఎస్టీ-రిజిస్ట్రేషన్​ పన్ను చెల్లింపుదారులను గుర్తించే అంశాన్ని సమీక్షించనున్నారు అధికారులు.

ఇదీ చూడండి:మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్​​ ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.