ETV Bharat / business

జీఎస్టీలో తేడా ఉంటే సస్పెన్షన్‌ వేటు..!

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌.. 'స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌'ను జారీ చేసింది. జీఎస్టీ విక్రయాల రిటర్నులు వారి సరఫరాదారుల రిటర్నులతో పోల్చిచూస్తే ఎటువంటి తేడాలు ఉండ కూడదు. ఒక వేళ తేడాలుంటే సదరు జీఎస్టీ విక్రయ దారుని రిజిస్ట్రేషన్​ను సస్పెండ్​ చేస్తారు.

GST
తేడా ఉంటే సస్పెన్షన్‌ వేటు..!
author img

By

Published : Feb 15, 2021, 5:17 AM IST

Updated : Feb 15, 2021, 5:40 AM IST

దాఖలు చేసిన జీఎస్టీ విక్రయాల రిటర్నుల్లో లేదా జీఎస్‌టీఆర్‌-1ఫారమ్‌లో ఏమైనా తేడా లేదా అవకతవకలు ఉంటే వెంటనే అధికారులు రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేస్తారు. వారి సరఫరాదారుల రిటర్నులతో పోల్చిచూస్తే ఎటువంటి తేడాలు ఉండ కూడదు. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ 'స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌'ను జారీ చేసింది.

లోపాలతో కూడిన రిటర్నులు దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్‌ చేసిన అనంతరం వివరాలతో ఉన్న ఒక నోటీస్‌ను సిస్టమ్‌ సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత ఆ నోటీస్‌ను సదరు పన్ను చెల్లింపుదారుల ఈమెయిల్‌కు పంపిస్తుంది. ఈ నోటీసు సదరు పన్ను చెల్లింపుదారులు లాగిన్‌ అయ్యాక వారికి నోటీస్‌ అండ్‌ ఆర్డర్‌ ట్యాబ్‌లో కనిపిస్తుంది. వీరు 30 రోజుల్లోపు వారి పన్ను అధికారికి తమ రిజిస్ట్రేషన్‌ ఎందుకు రద్దు చేయకూడదో వివరిస్తూ జవాబు ఇవ్వాలి. దీనిని కామన్‌ పోర్టల్‌ ద్వారా వారి పన్ను అధికారికి పంపించాలి.

జీఎస్టీ అధికారులు ఇప్పటికే తప్పుడు ఇన్వాయిస్‌లను దాఖలు చేసేవారిపై దృష్టిసారించారు. గత కొన్ని నెలలుగా ఇటువంటి వారిని కట్టడి చేసి జీఎస్టీ వసూళ్లు పెంచుతున్నారు. ఫలితంగా వరుసగా నాలుగు నెలల నుంచి జీఎస్టీ వసూల్లు రూ.లక్ష కోట్లను దాటుతున్నాయి. జనవరిలో అత్యధికంగా రూ.1.20లక్షల కోట్లు వసూలయ్యాయి.

ఇదీ చూడండి: అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్లకు కీలకం!

Last Updated : Feb 15, 2021, 5:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.