ETV Bharat / business

జీఎస్​టీ రేట్లపై ఉత్కంఠ వీడేది అప్పుడే!

కరోనా సంక్షోభం తర్వాత జూన్​ 14న తొలిసారిగా జీఎస్​టీ మండలి సమావేశం కానుంది. ఆ రోజే జీఎస్​టీ రేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

GST Council meeting likely to be held on June 14
జూన్​ 14న జీఎస్​టీ రేట్లపై వీడనున్న ఉత్కంఠ
author img

By

Published : Jun 1, 2020, 5:39 AM IST

జూన్​ 14న జీఎస్​టీ మండలి సమావేశం కానుంది. దేశంలో కరోనా వైరస్​ విజృంభణ తర్వాత మండలి సమావేశం కావటం ఇదే తొలిసారి. ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ నేతృత్వం వహించే ఈ సమావేశానికి కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా ఆదాయ మార్గాలు బాగా సన్నగిల్లిన తరుణంలో జీఎస్​టీ రేట్లను పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. అత్యవసరం కాని వస్తువులపై జీఎస్​టీని పెంచితే.. దాని ప్రభావం డిమాండ్​పై పడుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకం కలుగుతుందనే భావనలో మంత్రి ఉన్నట్లు అధికారులు తెలిపారు. లాక్​డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టే దిశగా అడుగులు వేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.

జూన్​ 14న జరిగే 40వ జీఎస్​టీ మండలి సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుత సంక్షోభం కారణంగా విపత్తు సెస్​ను కూడా ప్రవేశ పెడితే.. అది ప్రతికూలంగా మారుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:11 అంకెల మొబైల్​​ నంబర్లపై ట్రాయ్​ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.