ETV Bharat / business

నేడు జీఎస్టీ మండలి సమావేశం-చర్చాంశాలు ఇవే! - వాణిజ్య వార్తలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన ఇవాళ జీఎస్టీ మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు రంగాల పన్ను రేట్లు హేతుబద్దీకరణ సహా పోర్టల్​ సమస్యలు చర్చకు రానున్నాయి.

GST Council meet today
నేడు జీఎస్టీ మండలి సమావేశం
author img

By

Published : Mar 14, 2020, 6:02 AM IST

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి నేడు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సారి సమావేశంలో మొబైల్​ఫోన్లు, ఫుట్​వేర్​, టెక్స్​టైల్స్​ సహా మొత్తం ఐదు రంగాలపై పన్ను రేటు హేతుబద్దీకరించే అవకాశముంది.

ప్రధాన చర్చాంశాలు..

సెల్‌ఫోన్లు, ఎరువులు, నేత వస్త్రాలపై జీఎస్టీ రేటును 18 శాతానికి పెంచే అవకాశముంది. దీనిపై నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందువల్ల ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగినా.. పన్ను వ్యవస్థ లోపాలను సరిదిద్ది, తయారీదార్లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ పరిస్థితి మెరుగయ్యేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం కొన్ని ఉత్పత్తులకు 5, 12 శాతం జీఎస్టీ రేట్లు అమలవుతున్నా, వాటి తయారీకి అవసరమైన కొన్ని విడిభాగాలు, యంత్ర పరికరాలకు 18, 28 శాతం జీఎస్టీ రేట్లు ఉన్నాయి. అందువల్ల తయారీదార్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)కు దరఖాస్తు చేసినప్పుడు ఇబ్బందులెదురవుతున్నాయి. ఉత్పత్తి కంటే విడిభాగాల జీఎస్టీ రేట్లు అధికంగా ఉన్న వాటికి సంబంధించిన ఐటీసీ అభ్యర్థనలు ఏడాదికి రూ.20,000 కోట్ల మేర ఉంటున్నాయి. వీటిని సరిచేయాలని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పాదరక్షలు, దారం, దుస్తులు, పునర్వినియోగ ఇంధన పరికరాలు, ట్రాక్టర్లు వంటి వాటిల్లోనూ ఉంది.

  • సెల్‌ఫోన్‌కు ప్రస్తుతం 12 శాతం జీఎస్‌టీ ఉండగా, విడిభాగాలపై 18 శాతం పన్నురేటు అమలవుతోంది.
  • ఎరువులను తొలుత 12 శాతం శ్లాబ్‌లో ఉంచగా, తదుపరి 5 శాతానికి తెచ్చారు. అయితే దీనికి సంబంధించిన సేవలపై, యంత్ర పరికరాలపై 18 శాతం పన్నురేటు ఉంది. 2017 జులై నుంచి ఐటీసీ కింద రూ.6000 కోట్లు కోరారు.
  • నూలుదారం, వస్త్రాలపై రూ.1600 కోట్లు, రూ.2300 కోట్ల చొప్పున క్లెయిమ్‌లున్నాయి.

ఇదీ చూడండి:'వివాద్ సే విశ్వాస్' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.