ETV Bharat / business

మూడు రోజుల్లో జీఎస్‌టీ సంఖ్య ఇలా - జీఎస్‌టీ దరఖాస్తు

గతంలో జీఎస్​టీ సంఖ్య పొందాలంటే కనీసం మూడు వారాల సమయం పట్టేది. కానీ పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారులకు ఊరట కల్పిస్తూ.. కేవలం మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇందుకోసం భౌతిక తనిఖీలూ దాదాపు లేనట్టే కనిపిస్తోంది. మరి జీఎస్​టీ నంబర్​ ఎలా పొందాలి? ఎవరు అర్హులు? లాంటి పూర్తి వివరాలు మీకోసం...

A step-by-step guide to get GST number in 3 days
ఇకపై మూడు రోజుల్లోనే జీఎస్‌టీ సంఖ్య
author img

By

Published : Aug 26, 2020, 6:57 AM IST

Updated : Aug 26, 2020, 7:28 AM IST

జీఎస్‌టీ నంబరును కేవలం మూడు రోజుల్లో పొందేలా పన్ను చెల్లింపుదార్లకు, వ్యాపారులకు ఊరట కలిగించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. గత వారం ఆ మేరకు ఆధార్‌ ఆధారిత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను ఆవిష్కరించింది. ఇందులో సమయం తగ్గిపోవడమే కాదు.. చాలా వరకు కేసుల్లో కార్యాలయాన్ని భౌతికంగా తనిఖీ చేయడమూ ఉండకపోవచ్చు.

ఆధార్‌ ఆధారిత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ఎలా పనిచేస్తుందంటే..

కొత్త వ్యాపారులు జీఎస్‌టీ కింద నమోదు చేసుకునే సమయంలో దరఖాస్తుదారుకు ఆధార్‌ ఆధారిత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను ఎంచుకునే వీలుంటుంది. అయితే దరఖాస్తుదారు దీన్ని ఎంచుకోవాలా వద్దా అన్నది వారి ఇష్టమే.

  • ఒక వేళ 'యెస్‌' అని దరఖాస్తుదారు క్లిక్‌ చేస్తే ప్రమోటర్లు లేదా భాగస్వాములతో పాటు అధీకృత వ్యక్తులకు ఒక అథెంటికేషన్‌ లింక్‌ నమోదిత మొబైల్‌ నంబరు, ఇ-మెయిల్‌ ఐడీకి వస్తుంది.
  • ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే ఒక డిక్లరేషన్‌ ఫామ్‌ వస్తుంది. అందులో ఆధార్‌ నంబరును ఇవ్వాలి. ఆ తర్వాత 'వాలిడేట్‌' బటన్‌ను నొక్కాలి.
  • మీరిచ్చిన వివరాలు సరైనవి అయితే ఒక ఓటీపీ వస్తుంది. దాన్నీ అందులో పొందుపరచాలి. వాలిడేషన్‌ ప్రక్రియ పూర్తయి.. స్క్రీన్‌ మీద ఇ-కేవైసీ అథెంటికేషన్‌ విజయవంతమైనట్లు ఒక సంక్షిప్త సమాచారం వస్తుంది.

ఎలా ఈ సౌలభ్యాన్ని పొందొచ్చంటే..

www.gst.gov.in లో లాగిన్‌ అయి.. సర్వీసెస్‌ కింద ఉన్న రిజిస్ట్రేషన్‌ టాబ్‌లో న్యూ రిజిస్ట్రేషన్‌ను ఎంచుకోవాలి. లేదంటే రిజిస్ట్రేషన్‌ నౌ లింక్‌ను సైతం క్లిక్‌ చేయవచ్ఛు ఆ తర్వాత ఆధార్‌ అథెంటికేషన్‌ను ఎంచుకోవాలి. మీరు ఆధార్‌లో ఇచ్చిన మొబైల్‌ నంబరు లేదా ఇమెయిల్‌ నంబరును తెలుసుకోవాలంటే https://resident.uidai.gov.in/verify వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అర్హులు ఎవరు?

భారతీయ పౌరులందరూ ఈ వేగవంతమైన జీఎస్‌టీ నమోదును ఆధార్‌ అథెంటికేషన్‌ ద్వారా వినియోగించుకోవచ్ఛు అయితే పన్ను మినహాయింపుదార్లు, పన్ను వసూలుదార్లు, ఆన్‌లైన్‌ ఇన్ఫర్మేషన్‌ డేటాబేస్‌ యాక్సెస్‌ అండ్‌ రిట్రివల్‌(ఓఐడీఏఆర్‌) సేవలు, యూఐఎన్‌ ఉన్న పన్ను చెల్లింపుదార్లు, ప్రవాస పన్ను చెల్లింపుదార్లకు ఇది అవసరం లేదు.

ఆధారేతర జీఎస్‌టీ నమోదు కోసం..

ఆధార్‌ ఆధారిత జీఎస్‌టీ నమోదును వద్దనుకునే వ్యాపారులు ‘నో’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్ఛు ఇటువంటి కేసుల్లో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తును సంబంధిత అధికార్లకు పంపుతారు. అప్పుడు పత్రాల పరిశీలన, కార్యాలయ తనిఖీకి భౌతికంగా అధికార్లు వస్తారు.

రెండు ఆప్షన్ల విషయంలో నిర్దిష్ట గడువులోనే సంబంధిత అధికార్లు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్‌ ఆధారిత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు 3 రోజులు; ఆధారేతర ప్రక్రియకు 15 రోజుల సమయంలో పూర్తి చేయాలి. అలాగే తిరస్కరించాలన్నా ఆ సమయంలోపే చేయాలి. ఒక వేళ తొలి కేసులో 3 రోజులకు మించి; రెండో కేసులో 21 రోజులకు మించితే రిజిస్ట్రేషన్‌కు ఆమోదం లభించినట్లే అవుతుంది.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: భారీగా పడిపోయిన జీఎస్​టీ వసూళ్లు

Last Updated : Aug 26, 2020, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.