క్రిప్టో కరెన్సీకి సంబంధించి త్వరలో బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.
"ఇప్పుడున్న చట్టాలకు క్రిప్టో కరెన్సీతో వస్తోన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం లేదు. అంతేకాదు ఆర్బీఐ, సెబీ లాంటి నియంత్రణ సంస్థలకు కూడా క్రిప్టో కరెన్సీతో వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి చట్టపరమైన అధికారాలు లేవు. అందుకే కొత్త బిల్లును తీసుకురావాలనుకుంటున్నాం. బిల్లు తుది రూపు దాల్చింది. కేబినెట్ ఆమోదానికి పంపడమే మిగిలింది."
-అనురాగ్ ఠాకూర్, కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి
వర్చువల్ కరెన్సీతో వస్తోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2018 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిప్రకారం బిట్ కాయిన్‌తో కానీ వర్చువల్ కరెన్సీతో కానీ ఎటువంటి లావాదేవీలు చేయరాదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఈ ఉత్తర్వులను 2020 మార్చి4 సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
ఇదీ చూడండి: 'ఓటీటీలకు మార్గదర్శకాలు రెడీ, త్వరలోనే అమలు'