ETV Bharat / business

టిక్​టాక్​ సహా చైనా యాప్​లపై నిషేధం పొడిగింపు

టిక్‌టాక్‌ సహా ఇతర చైనీస్‌ యాప్‌లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. వాటి యాజమాన్యాలు పంపిన సమాధానాలను నిశితంగా పరిశీలించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

author img

By

Published : Jan 23, 2021, 10:18 PM IST

Updated : Jan 23, 2021, 10:29 PM IST

Govt to continue ban on Chinese apps including Tiktok
టిక్​టాక్​పై నిషేధాన్ని పొడింగించిన కేంద్రం

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తున్నాయి అనే ఆరోపణతో వేటుకు గురైన టిక్​టాక్​ సహా పలు చైనా అప్లికేషన్​లపై విధించిన నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థలకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పంపింది. గతంలో అప్లికేషన్​ల యాజమాన్యాలు పంపించిన ప్రత్యుత్తరాలను సమీక్షించినప్పటికీ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులను జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం పంపిన నోటీసులు అందినట్లు టిక్​టాక్​ తెలిపింది. కేంద్రం పంపిన ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తిరిగి ప్రత్యుత్తరం పంపుతామని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

"2020 జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంస్థల్లో టిక్​టాక్​ ఒకటి. ఆయా దేశాల చట్టాలను, నిబంధనలను పాటించటానికి మేము కట్టుబడి ఉన్నాము. అందుకు సంబంధించి మా వంతు కృషి చేస్తాము. ప్రభుత్వానికి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వినియోగదారుల గోప్యత, భద్రతను కాపాడాటమే మా తొలి ప్రాధాన్యత."

- టిక్​టాక్ అధికార ప్రతినిధి

దేశీయ వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు ఉన్న కారణంతో టిక్​టాక్​ సహా మొత్తం 59 చైనా యాప్​లపై కేంద్రం నిషేధం విధించింది.

ఇదీ చూడండి: భారత్​ అసాధారణ నిర్ణయంతో టిక్​టాక్​కు భారీ దెబ్బ

Last Updated : Jan 23, 2021, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.