దేశంలో వంట నూనెల ధరలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులపై ఉన్న ఆంక్షలను డిసెంబర్ 31 వరకు సడలించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చర్య ద్వారా దేశీయ మార్కెట్లో నిల్వలు పెరిగి.. ధరలు దిగి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
అంతర్జాతీయంగా వంట నూనెలు, శుద్ధి చేసిన పామాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ముడి పామాయిల్‌పై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. సెప్టెంబర్ వరకు ఇది అమలులో ఉంటుందని మంగళవారం తెలిపింది.
దిగుమతుల వల్లే..
దేశంలో వినియోగించే వంటనూనెలో దిగుమతుల నుంచి వచ్చేదే ఎక్కువ. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ధరలు దేశంలో ఆయిల్ రేట్లపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ప్రపంచంలో వెజిటెబుల్ ఆయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారతే. ఏటా 15 మిలియన్ టన్నుల వెజిటెబుల్ ఆయిల్‌ను విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుండగా.. 9 మిలియన్ టన్నుల పామాయిల్, 6 మిలియన్ టన్నుల సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తోంది.
ఇదీ చదవండి: