ETV Bharat / business

కొబ్బరిపై కనీస మద్దతు ధర పెంపు - మిల్లింగ్ కోప్రా కనీస మద్దతు ధర పెంపు

కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిల్లింగ్ కోప్రాపై క్వింటాలుకు రూ. 375, బాల్​ కోప్రాపై క్వింటాలుకు రూ. 300 పెంచుతున్నట్లు వెల్లడించింది.

Govt hikes MSP on copra
కొబ్బరిపై కనీస మద్దతు ధర పెంపు
author img

By

Published : Jan 27, 2021, 4:31 PM IST

కొబ్బరిపై కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు మిల్లింగ్ కోప్రా( ఎండు కొబ్బరి)పై క్వింటాకు రూ. 375, బాల్ కొప్రా(కురిడీ-ఎండు కొబ్బరిని చిప్పలుగా చేయకుండా కొబ్బరి మొత్తం గుండ్రంగా ఉండేలా తీసేది)పై క్వింటాలుకు రూ. 300 పెంచినట్లు పేర్కొంది.

రైతులకు చేయూతనిచ్చే దిశగా.. 2021లో కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపినట్లు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ వెల్లడించింది. క్వింటాలు మిల్లింగ్​ కోప్రా ధరను రూ. 9,960 నుంచి రూ. 10,335కి, క్వింటాలు బాల్ కోప్రా ధరను రూ. 10,300 నుంచి రూ. 10,600లకు పెంచినట్లు తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే.. కనీస మద్ధతు ధర మిల్లింగ్​ కోప్రాకు 52 శాతం, బాల్​ కోప్రాకు 55 శాతం అధికంగా ఉన్నట్లు చెప్పారు. మార్కెట్​ ధరలు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు.

ఇదీ చదవండి:భారత్​లో కార్యకలాపాలకు 'టిక్​టాక్'​ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.