ETV Bharat / business

ఈ సారికి పాత శాలరీనే..! - నాలుగు లేబర్స్​ కోడ్​ వాయిదా

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్​ కోడ్స్​ అమలు వాయిదా పడింది. ఏప్రిల్​ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని కార్మిక శాఖ తొలుత నిర్ణయించింది. అయితే.. కొన్ని రాష్ట్రాలు వీటికి సంబంధించిన విధి విధానాలు రూపొందించని నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు తెలిపింది కార్మిక శాఖ.

Govt defers labour codes implementation
ఈ సారికి పాత శాలరీలే!
author img

By

Published : Mar 31, 2021, 6:35 PM IST

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక స్మృతుల(లేబర్‌ కోడ్స్‌) అమలు వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలు లేబర్‌ కోడ్స్‌కు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా.. ఏప్రిల్‌ 1 నుంచి వేతనాల విధానంలో మార్పులు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఎలాంటి మార్పులూ ఉండబోవు.

కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్‌ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన స్మృతులను కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి నాలుగు కోడ్‌లను అమల్లోకి తీసుకురావాలని కార్మిక శాఖ నిర్ణయించింది. రాజ్యాంగం ప్రకారం.. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలు రూపొందించినప్పటికీ.. ఇతర రాష్ట్రాలు ఇంకా ఖరారు చేయనందున ప్రస్తుతానికి లేబర్‌ కోడ్‌ అమలును వాయిదా వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఎలా లెక్కిస్తారంటే?

లేబర్‌ కోడ్‌ల వల్ల శాలరీ విధానంలో పలు మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త నిబంధనల ప్రకారం.. అలవెన్సుల వాటా 50 శాతం మించకూడదు. ఆ లెక్కన బేసిక్‌ పెరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బేసిక్‌+డీఏ ఆధారంగా లెక్కించే పీఎఫ్‌ వాటా కూడా పెరుగుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి వచ్చి ఉంటే.. ఆ మేర టేక్‌ హోమ్‌ శాలరీ, పీఎఫ్‌ మొత్తంలో మార్పులు జరిగేవి. లేబర్‌ కోడ్‌ల అమలు వాయిదా పడిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు పాత విధానంలోనే శాలరీని అందుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: 'వచ్చే ఐదేళ్లలో 71.7 శాతం డిజిటల్​ చెల్లింపులే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.