చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై కోత విధిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఇందుక సంబంధించిన అన్ని పథకాల వడ్డీరేట్లును 2020-21 తొలి త్రైమసికం ఏప్రిల్-జూన్లో 1.4 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసికంగా సమీక్షిస్తారు. నూతన వడ్డీ రేట్లతో 1-3ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు 6.9కి బదులు 5.5శాతమే వస్తుంది. వడ్డీ రేట్లు మూడు నెలలకొసారి చెల్లిస్తుండగా.. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లు ఇక నుంచి 6.7శాతం వడ్డీరేటును పొందుతాయి. ప్రస్తుతం ఇది 7.7శాతంగా ఉంది.