ETV Bharat / business

ఉద్యోగులకు భారీ బోనస్​ ప్రకటించిన గూగుల్ - గూగుల్​ వార్తలు తాజా

Google Bonus For Employees: టెక్​ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్​.. ఉద్యోగులకు భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సుమారు 1600 డాలర్లను బోనస్​గా ప్రకటించింది.

google
గూగుల్​
author img

By

Published : Dec 10, 2021, 5:39 PM IST

Google Bonus For Employees: ప్రముఖ టెక్​ కంపెనీ గూగుల్​ ఉద్యోగులకు భారీ బోనస్​ను ప్రకటించింది. తాజాగా సంస్థ తీసుకున్న రిటర్న్​ టూ ఆఫీస్​ ఆలోచనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1600 డాలర్లను బోనస్​గా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

కేవలం కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కాకుండా.. ఈ బోనస్​ను సంస్థ నియమించుకున్న ఫ్రీలాన్సర్​లకు, ఇంటర్న్​లకు కూడా ఈ ఒన్ టైం క్యాష్​ బోనస్​ వర్తిస్తుందని గూగుల్​ పేర్కొంది. ఈ మొత్తాన్ని ఈ నెలలోనే ఉద్యోగులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వైరస్​ వ్యాప్తి సమయంలో ఉద్యోగులుకు మద్దతుగా నిలవడానికి వర్క్​ఫ్రమ్-హోమ్ అలవెన్స్​, వెల్‌బీయింగ్ బోనస్‌తో పాటు తాజాగా ప్రకటించిన బోనస్​ను జమ చేయనుంది.

గతేడాది మార్చిలో కూడా గూగుల్​ ఉద్యోగుల శ్రేయస్సు కోసం 500 డాలర్లను ప్రకటించింది. జనవరి 10 నుంచి ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని భావించినా.. ఒమిక్రాన్​ భయాలతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఇదీ చూడండి : అప్పు చేసి మదుపు చేస్తే.. మొదటికే మోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.