దేశీయంగా బంగారం, వెండి ధరల్లో మంగళవారం భారీగా పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.816 పెరిగి.. రూ.49,430కు చేరింది.
పసిడి బాటలోనే వెండి ధర కిలోకు రూ.3,063 ఎగబాకి.. రూ.64,361కి చేరింది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న పుత్తడి ధరలకు అనుగుణంగా.. దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,864 డాలర్ల వద్ద ఉండగా.. ఔన్సు వెండి 24.52 డాలర్లుకు చేరింది.
ఇదీ చూడండి: ఐటీఆర్ దాఖలుకు ఫారాలు ఇవే..