దేశీయంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా క్షీణించాయి. దేశ రాజధాని దిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి వెల రూ. 522 తగ్గి.. రూ.43,887కు చేరింది.
వెండి కూడా పుత్తడి బాటలోనే పయనించింది. దిల్లీలో కిలో వెండి ధర రూ.1,822 క్షీణించి రూ.64,805గా ఉంది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, రూపాయి విలువ మెరుగుపడటం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,696డాలర్లు, వెండి ధర 25.20 డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి: నెలకు రూ.8వేలు రాబడి రావాలంటే..