ప్రపంచ మార్కెట్ల బలహీనమైన ధోరణికి అనుగుణంగా దేశీయంగానూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.222 తగ్గి రూ.43,358గా ఉంది. కిలో వెండి ధర రూ.60 తగ్గి రూ.48,130గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,632 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 17.25 డాలర్లుగా ఉంది.
"అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో దేశీయంగానూ పసిడి ధరలు తగ్గాయి. అయితే రూపాయి విలువ బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు మాత్రం లేవు."- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్
పెట్టుబడిదారులు బాండ్ల లాంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లడం కూడా పసిడి, వెండి ధరలు తగ్గడానికి మరో కారణమని తపన్ విశ్లేషించారు.
ఇదీ చూడండి: దలాల్ స్ట్రీట్‌పై కరోనా పంజా- సెన్సెక్స్ 1448 పాయింట్లు పతనం