బంగారం ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు ఒక్క రోజే రూ.1,155 పెరిగి.. రూ.44,383 వద్దకు చేరింది.
పసిడిని సురక్షితంగా భావించి మదుపరులు భారీగా పెట్టుబడులు పెడుతుండటం ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటమూ ఇందుకు మరో కారణంగా విశ్లేషిస్తున్నారు.
పసిడి బాటలోనే వెండి కూడా నేడు కిలోకు రూ.1,198 (దిల్లీలో) పెరిగి.. రూ.47,729 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఔన్సు బంగారం ధర 1,638 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 17.17 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:క్రిప్టో కరెన్సీపై నిషేధం ఎత్తివేత... సుప్రీం కీలక నిర్ణయం