బంగారం, వెండి ధరలు మరింత క్షీణించాయి. క్రితం సెషన్లో స్వల్పంగా కోల్పోయిన ధరలు ఇవాళ భారీగా పతనమయ్యాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,097 తగ్గి రూ.42,600కు చేరింది.
వెండి సైతం భారీగా పతనమైంది. కిలో వెండి ధర రూ.1,574 తగ్గి ప్రస్తుతం రూ.44,130కి చేరుకుంది.
భయాందోళనలు నెలకొన్న కరెన్సీ మార్కెట్లో ద్రవ్యత్వం పెంచడానికి రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టడం వల్ల రూపాయి బలపడి... బంగారం ధరలపై ప్రభావం చూపినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నెలకొన్న అస్థిరత సైతం దేశీయంగా ప్రభావం చూపించినట్లు చెబుతున్నారు.
అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,584 అమెరికన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 15.65 డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి: కోలుకున్న మార్కెట్లు- సెన్సెక్స్ రికార్డు రికవరీ